ఆ నాణేలు చెల్లవనొద్దు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కమలాపురం, న్యూస్‌టుడే: మార్కెట్‌లో రూ. 5, రూ. 10, రూ. 20 ఇలా అనేక రకాల నాణేలు పలు రకాల ఆకారాల్లో చెలామణిలో ఉన్నాయి. అయితే కొందరు వ్యాపారులకు సరైన అవగాహన లేక కొన్నింటిని తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయంటూ ఓ లఘు చిత్రాన్ని విడుదల చేసింది. వదంతులు నమ్మవద్దని తెలుపుతూ కార్టూన్ల ద్వారా వివరించింది. ఆయా బ్యాంకు ఖాతాదారుల వాట్సాప్‌కు ఆర్‌బీఐ పేరుతో సందేశాలూ పంపుతోంది.
ఓటీపీ, పాస్‌వర్డ్ చెప్పొద్దు
- సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ ఏ విధమైన ఓటీపీ, పాస్‌వర్డ్ వంటివి చెప్పవద్దని ఆర్‌బీఐ సూచిస్తోంది.
- శనివారం నుంచి చెక్కుల క్లియరెన్స్ మరింత వేగవంతం చేసి కొన్ని గంటల్లోనే ఖాతాలో నగదు జమ చేసే సౌకర్యాన్నీ అందుబాటులోకి తెస్తోంది. చెక్‌బౌన్స్‌కు అడ్డుకట్ట వేసేలా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచాలని ఖాతాదారులకు సూచిస్తోంది.
- పదేళ్లకు పైబడి బ్యాంకు ఖాతా వినియోగించకుండా వదిలేసినా, అందులోని సొమ్ము పొందడానికీ వెసులుబాటు కల్పించింది. ఇందుకుగాను పాత ఖాతా ఉన్న సదరు బ్యాంక్‌కు ఖాతాదారుడే వెళ్లి ఈకేవైసీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులు పొందే వీలు కల్పించింది.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చిన్నారిపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం [ 18-02-2026] అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
- రూ. 30 కోట్లు చెత్తలో పోసినట్టేనా! [ 18-02-2026] కడప నగరపాలక, న్యూస్‌టుడే: రూ. 30 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా పనులు చేపట్టారు. చెత్త కనుమరుగవుతుందని జనం సంతోషించారు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచలేదు.
- ఎదురింట్లోనే మృగాడు! [ 18-02-2026] మానవీయ విలువలకే సమాధి కట్టే.. మనుషులమన్న విషయానికే అనుమానమొచ్చే దుర్ఘటన మంగళవారం మదనపల్లె జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృగాడి వాంఛాగ్నిలో ఓ లేత కలువ కాలిపోయింది.
- కూడళ్లు.. నరకానికి నకళ్లు [ 18-02-2026] పుంగనూరు పట్టణ సమీపంలో వెళ్లే ముంబై-చెన్నై జాతీయ రహదారిలో పలు కూడళ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మదనపల్లె-పలమనేరు మధ్య గల ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది.
- చురుగ్గా వసతి గృహ నిర్మాణాలు [ 18-02-2026] సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాల సమస్య వెంటాడుతోంది. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి.
- కాబోయే అమ్మకు ఆపద [ 18-02-2026] పండంటి శిశువుకు జన్మనివ్వాల్సిన అమ్మను రక్తహీనత వేధిస్తోంది. పౌష్టికాహార లోపమే చాలా మంది గర్భిణులకు శాపమై చుట్టుముడుతోంది.
- సౌత్‌జోన్ క్రికెట్ పోటీల్లో.. [ 18-02-2026] ఏసీఏ సౌత్‌జోన్ అండర్-12 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ పోటీల్లో చిత్తూరు, కర్నూలు జట్లు గెలుపొందాయి. కర్నూలు జట్టు సభ్యుడు గోవర్థన్‌రెడ్డి సెంచరీ చేశాడు.
- ఉరేసుకుని యువకుడి బలవన్మరణం [ 18-02-2026] మండలంలోని ఇందిరానగర్‌లో నిఖిల్ (28) అనే యువకుడు మంగళవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి రామకృష్ణతో కలిసి ఉంటున్నాడు.
- మాఫియా దందా.. ఆగేదుందా! [ 18-02-2026] జిల్లాలో పొగాకు మాఫియాకు కళ్లెం వేసే వారే కరవయ్యారు.. రూ.కోట్లు దోపిడీ సాగిస్తున్నా కళ్లకు గంతలు కట్టుకున్నారు.. మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు యథేచ్ఛగా ధరల బాదుడు కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
- ఏసీబీ ఆన్ డ్యూటీ [ 18-02-2026] అవినీతి నిరోధక శాఖ అవినీతి అధికారుల భరతం పడుతోంది. లంచం తీసుకుంటున్నారని కచ్చితమైన సమాచారం వస్తే చాలు దాడులు చేస్తోంది. 2025లో ఒక్క దాడీ లేదు.
- బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు [ 18-02-2026] ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన ఘటన బి.కోడూరు మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.