నిషేధ

నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం

తొలగించుకునేందుకు

మార్గదర్శకాల విడుదల

ప్రశాంతి నిలయం:నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో 22–ఏ జాబితాలోని భూములుకు మోక్షం లభించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన పత్రాలు రైతులు సమర్పిస్తే నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తామని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు కూడా ఇప్పుడు కలెక్టర్‌ స్థాయిలోనే జరుగుతుందన్నారు.

5న రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించండి..

రెవెన్యూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఈనెల 5వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆర్డీఓలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎన్జీజీఓ జిల్లా కమిటీ

ఎన్నికకు రేపు నామినేషన్లు

పుట్టపర్తి టౌన్‌:ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌, గెజిటెడ్‌ (ఏపీ ఎన్జీజీఓ) అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఈ నెల 5వ తేదీ సోమవారం నామినేషన్లు ఉంటాయని జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు లింగా రామ్మోహన్‌, ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఏడు తాలూకాల్లో ఇప్పటికే కార్యవర్గాల ఎన్నికలు ముగిశాయన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఈనెల 15న నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలో పోటీ చేయాలనుకునే సభ్యులు జనవరి 5 తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చన్నారు.

స్వీయ పరివర్తనతోనే

నాయకత్వ లక్షణాలు

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌

మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌

ప్రశాంతినిలయం:యువత సన్మార్గంలో పయనిస్తూ స్వీయపరివర్తన సాఽధించినప్పుడే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం సాధ్యమవుతుందని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్స్‌ పూర్తి చేసుకున్న ఆరో బ్యాచ్‌ విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్ల అందజేశారు. కార్యక్రమానికి ఆర్‌జే రత్నాకర్‌ రాజు, సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ చక్రవర్తి, వైస్‌ చైర్మన్‌న్‌ నిమీష్‌ పాండ్య, ప్రోగ్రాం కన్వీనర్‌ యోగేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ రాజు మాట్లాడుతూ... సత్యసాయి బాబా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. యువత సత్యం, మానవతా విలువలతో తమను తాము మార్చుకుంటూ సమాజానికి దిశ నిర్దేశం చేసే నాయకులుగా ఎదగాలన్నారు. అనంతరం కోర్స్‌ పూర్తి చేసిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. సాయంత్రం విద్యార్థులు సత్యసాయి మహా సమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులను అలరించారు.

గుడిబండలో

ఎలుగుబంట్ల సంచారం

గుడిబండ:అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఎలుగుబంట్లు ఊళ్లలోకి వచ్చేశాయి. శుక్రవారం రాత్రి రెండు ఎలుగుబంట్లు గుడిబండలో హల్‌చల్‌ చేశాయి. పోలీస్‌ స్టేషన్‌ వద్దనున్న వాల్మీకి విగ్రహం వద్ద అటూ ఇటూ తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. స్థానికులు పెద్దపెద్ద శబ్దాలు చేయడంతో కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.

నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం 1
1/2

నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం

నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం 2
2/2

నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం