Venezuela: వెనెజువెలాలో అమెరికా భీకర దాడులు.. ఎమర్జెన్సీ విధింపు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా (Venezuela) బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అగ్రరాజ్యం అమెరికా ఈ దాడులకు దిగింది. రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో దేశంలో అత్యయిక పరిస్థితి విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ (US President Donald Trump) ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా శనివారం దాడులకు పాల్పడినట్లు వెనెజువెలా వెల్లడించింది. దీంతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ దాడులతో దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమెరికన్ ఎయిర్‌లైన్లకు సూచన
ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కీలక సూచన చేసింది. వెనెజువెలా గగనతలాన్ని వినియోగించొద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వెనెజువెలా (venezuela) ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ( USA) ముంచెత్తుతున్నాయని ట్రంప్ ( Donald Trump) పలుమార్లు పేర్కొన్నారు. ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ఆరోపిస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను మోహరించింది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 12:47 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అమెరికాతో చర్చలకు జెనీవాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. అక్కడ అరాఘ్చీ స్విట్జర్లాండ్, ఒమన్ విదేశాంగమంత్రులతో భేటీ అవుతారు.
- గ్రహాంతర జీవులు ఉన్నాయి.. కానీ: ఒబామా ఏరియా 51లో గ్రహాంతర జీవులను అమెరికా నిర్భందించిందనే ఊహాగానాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా స్పందించారు.
- రష్యా చమురు కొనమని భారత్ హామీ ఇచ్చింది! - అమెరికా చమురు దిగుమతి విషయంలో జాతీయ ప్రయోజనాలే తొలి ప్రధాన్యమని భారత్ పునరుద్ఘాటిస్తున్న విషయం తెలిసిందే.