Musi: మూసీపై ముందుకే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

పేదలకు మెరుగైన వసతులు
మూసీ పరీవాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పాత బస్తీ సహా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. మంచిరేవుల సమీపంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, మూసీ తీరం వెంట గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాల ద్వారా మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం.
ఈనాడు, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశ అంచనాలను మార్చి 31 నాటికి ఖరారు చేసి, ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మొదటిదశలో గండిపేట, హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కేంద్రానికి సమర్పించామని.. వారు అడిగిన కొన్ని వివరణలకు సమాధానాలు పంపుతున్నామని తెలిపారు. సంక్రాంతిలోగా డీపీఆర్‌పై స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. అది సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తామన్నారు. మూసీ ప్రక్షాళనకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. రక్షణశాఖకు చెందిన భూములిచ్చేందుకు కేంద్రం అంగీకరిచిందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో రూ.7 వేల కోట్లతో గోదావరి నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. ఇందులో 15 టీఎంసీలతో ప్రజల దాహార్తి తీరుస్తామని.., మరో 5 టీఎంసీలను గండిపేటకు తరలిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, దీనిలో పునరుజ్జీవం అత్యంత కీలకమని సీఎం వివరించారు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించి, ఉద్యోగ, విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శుక్రవారం శాసనసభలో మూసీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధిపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానమిచ్చారు.
నది పరీవాహకంలోనే అభివృద్ధి
‘‘మూసా, ఈసా నదుల సంగమమే మూసీ... మూసా అనంతగిరి గుట్టల నుంచి ప్రవహిస్తుంది. మూసాకు ఉస్మాన్‌సాగర్.. ఈసాకు హిమాయత్‌సాగర్.. ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతగిరి నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ ప్రవహిస్తుంది. కాకతీయుల కాలం నుంచి నిజాంల వరకు నది పరీవాహకంలోనే ప్రాజెక్టులు చేపట్టారు. నాడు నిజాం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నిర్మించారు. ఆ ప్రాజెక్టులే నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా.. ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీపడేలా నిజాంలు తీర్చిదిద్దారు. తర్వాత ఆ అభివృద్ధి కనుమరుగైంది. నదులను కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారు. హైదరాబాద్‌లో మురుగు కాలువలను మూసీ నదికి కలిపారు. జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదు. వాటిని కలుషితం చేసి, కబ్జాలు పెట్టి, ఫాంహౌస్‌లు కట్టారు. ఫాంహౌస్‌ల డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారు. మూసీ కాలుష్యం కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు పేర్కొనగా.. అక్కడ నివసించలేని పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కలుషిత నీటి నుంచి తమను కాపాడాలని వేల మంది విజ్ఞప్తి చేయగా.. నిందితులపై ఉక్కుపాదం మోపి డ్రైనేజీలు కూలగొట్టాం. జలాశయాల పరీవాహక ప్రాంతంలోని జన్వాడ, మొయినాబాద్‌లో ఫాంహౌస్‌లలో తనిఖీలు జరిగాయి. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత నాపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు.
విస్తృత అధ్యయనం
నది పరీవాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్, జపాన్, జర్మనీ, సింగపూర్, దక్షిణకొరియాలలో విస్తృతంగా అధ్యయనం చేశాం. ప్రపంచస్థాయి నగరాల్లో నది పరీవాహక ప్రాంతాలను కాపాడుకుని వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆయా దేశాలు పోటీపడుతున్నాయి, గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను తరలించాయి. యూపీలో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. నది పరీవాహక ప్రాంతాల అభివృద్ధిని భాజపా ఎన్నికల ఎజెండాగా మార్చింది. ఆయా రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించట్లేదు. నది పరీవాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కోరాం. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన అనంతరం, మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశాం.

మూడు సంస్థలతో జాయింట్ వెంచర్
మూడు సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును రూపొందించాయి. ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. మార్చి 31 నాటికి అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మూసా, ఈసా, గోదావరి మూడు నదుల సంగమంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను ప్రాజెక్టును చేపట్టి అభివృద్ధి చేస్తాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా చూస్తాం. 20 టీఎంసీలలో.. 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలోకి తరలిస్తాం. గోదావరి నుంచి 20 టీఎంసీలు నగరానికి తరలిస్తాం. హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు 15 టీఎంసీలు, మరో 5 టీఎంసీలు గండిపేటకు తరలిస్తాం.
రియల్ ఎస్టేట్ ఒక పరిశ్రమ
రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారారని నన్ను విమర్శిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పరిశ్రమ. దానిని అభివృద్ధి చేసి వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. స్థిరాస్తి రంగాన్ని విస్తరిస్తే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు అవే వస్తాయి, హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు ఇలాంటి విమర్శలే చేశారు. రాబోయే 20 ఏళ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుంది. రాష్ట్ర జనాభాలో మూడో వంతు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.
కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది
నేను వివరాలు చెబుతుంటే కొందరు విషం కక్కుతున్నారు. వారు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం ప్రమాదకరం. నిజాలు ప్రజలకు తెలియకూడదని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారు. మూసీని అడ్డుకోకండి.. అక్కడి పేదలకు ఏం చేయాలో చెప్పండి. మూసీ ప్రక్షాళన చేయాలని కొందరు భారాస ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు మేం కల్పిస్తామంటే.. వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం’’ అని వివరించారు.
గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్
గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నాం. ఓఆర్‌ఆర్ 160 కి.మీ ఉంది. ఈ మధ్యలో నుంచి వెళ్లినా 80 కి.మీ. దూరం ప్రయాణించాలి. గండిపేట-గౌరెల్లి కారిడార్ పూర్తయితే 55 కి.మీ. ప్రయాణిస్తే గమ్యం చేరవచ్చు. నార్సింగి, బాపూఘాట్, చార్మినార్, చాదర్‌ఘాట్, నాగోల్ వద్ద జంక్షన్‌లు ఏర్పాటు చేశాం. రూ.450 కోట్లతో రెండేళ్లలో మీరాలం ట్యాంకు అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. పాతబస్తీని మేం ఎప్పుడూ దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. గౌలిగూడ వద్ద వదిలేసిన మెట్రోను చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నాం.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
- యాదగిరిని నేడు హాజరుపరచండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10.30కు కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
- ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలి (ఏ6)గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
- ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా హైదరాబాద్: శ్రీధర్‌బాబు జీవశాస్త్ర రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
- కార్ టీ-సెల్ థెరపీతో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు కార్ టీ-సెల్, జీన్ థెరపీలతో భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం(అమెరికా) ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ లెవిన్ పేర్కొన్నారు.