
World Telugu Conference: తెలుగు వెలుగుల వేడుక

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, గుంటూరు సాంస్కృతికం: మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు
జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కల్యాణాలు ఉంటాయన్నారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాలు సందడి చేయనున్నాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరు కానున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు.
రెండో రోజు మారిషస్ అధ్యక్షుడి రాక
4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. శనివారం రాత్రికే ఆయన గుంటూరు చేరుకోనున్నారు. ఉత్తరాఖండ్ జ్యోతిష్మఠ్ జగద్గురు ఆదిశంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శాసనమండలి ఛైర్మన్ పి.మోషేనురాజు, మంత్రులు పాల్గొంటారు. సాయంత్రం జరిగే కార్యక్రమాలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి హాజరవుతారు. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాల ప్రదానం జరగనుంది.
చివరి రోజున సీఎం చంద్రబాబు రాక
మహాసభల చివరి రోజైన సోమవారం ఉదయం కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు, పలువురు మంత్రులు హాజరవుతారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టల్ కవర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మన తెలుగు భాష - అమృత భాష’ అంశంపై ప్రసంగించనున్నారు. సాయంత్రం జరిగే ముగింపు సభకు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు.
మూడు రోజుల కార్యక్రమంలో అనేక తెలుగు సాహిత్య ప్రక్రియలు అలరించనున్నాయి. అష్టావధానాలు, తెలుగు గజల్ సదస్సులు, భక్తి సాహిత్యం, చలనచిత్ర సాహిత్యంపై ప్రసంగాలు, ఇష్టాగోష్ఠులు, గీతాలాపనలు, వివిధ రకాల పురస్కారాల ప్రదానం చేపట్టనున్నారు. తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రాజావారి కోట కాదిది.. పోలీసు ఠాణానే రాజుల కాలంలోని కోట తరహాలో కనిపిస్తున్న ఈ భవనం పోలీస్‌స్టేషన్ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లాలోని కోటనందూరు ఠాణా ఇది.
- క్లిక్ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో! ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు.
- ‘యువగళం’ గుర్తు.. సైకిల్! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఆ సందర్భం గుర్తుండిపోయేలా చేస్తున్నారు.
- నాటి వైభోగం.. నేటి జ్ఞాపకం గోకర్ణం, గంగాళం, ముక్కుపొడుం మీనా, ధూమం అరలు, శకుంతలపాత్ర, పూలబుట్టలు, కావడి పెట్టె, మర చెంబులు.. ఏంటివన్నీ అనుకుంటున్నారా?
- నేడు రాజధానికి బిల్‌గేట్స్ బృందం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు.
- రాకింగ్.. రామసుబ్బమ్మా! జీవితంలో గెలవాలంటే ఏ వయసులోనైనా ప్రయత్నించి, విజయం సాధించొచ్చు అనడానికి ఈ బామ్మే ఉదాహరణ.
- గిరులన్నీ.. భక్త జన సిరులు ఎటు చూసినా పారవశ్యం... భక్తజన కోలాహలం.. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి.. ఆధ్యాత్మికతను పంచాయి.
- సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన్న వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న.. అప్పటి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదు అంతకు మించి నమ్మినబంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమయ్యింది.
- శివరాత్రి వేళ.. పుష్కరాలకు సన్నాహాలు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు సన్నాహక చర్యల్లో భాగంగా.. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన భక్తుల రద్దీని అధికారులు శాస్త్రీయంగా అంచనా కట్టారు.
- ఆదిత్యుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆయలం, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
- కాలచక్ర మ్యూజియానికి నిర్లక్ష్యపు గ్రహణం బౌద్ధారామాల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన కాలచక్ర మ్యూజియంపై నిర్లక్ష్యం కమ్ముకుంది.
- కర్నూలులో నల్లరెక్కల తెల్లడేగ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని పంట పొలాల్లో నల్లటి రెక్కల తెల్ల డేగ కనిపించింది. రైతులు దీన్ని తమ నేస్తంలా భావిస్తారు.
- 4 నగరాలు.. రూ. 2 వేల కోట్ల లక్ష్యం కొత్త ఆర్థిక సంవత్సరంలో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (యూసీఎఫ్) కింద రూ.2వేల కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
- ర్యామ్, చిప్‌ల కొరతతో.. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలకు రెక్కలు మీరు మొబైల్ మార్చాలని.. కొత్త ల్యాప్‌టాప్ కొనాలని.. కంప్యూటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి.
- ఈ బడ్జెట్.. రాష్ట్రాభివృద్ధికి సరైన రోడ్‌మ్యాప్ అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్? దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్‌కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది.
- ‘అగ్నివీర్’ నియామకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్ అధికారి, గుంటూరు డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు.. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
- కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
- దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.