‘భీమవరం బీట్‌ సాంగ్‌’.. స్టెప్పులేసిన రఘురామ

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 03 Jan 2026 15:27 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భీమవరం పట్టణం: శాసనసభను హుందాగా నడపడంలోనే కాదు.. నటనలోనూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో రఘురామ పాల్గొన్నారు. గాయని స్మిత రూపకల్పన చేసిన ‘భీమవరం బీట్’ పాటను ఆయన విడుదల చేశారు. అనంతరం పాటను తెరపై ప్రదర్శించారు. భీమవరం బీట్ సాంగ్‌లోని కొన్ని సన్నివేశాల్లో రఘురామకృష్ణరాజు నటించారు. పాట విడుదల అనంతరం గాయని స్మిత బృందంతో స్టేజీపై స్టెప్పులేశారు. రఘురామకృష్ణరాజు చిందులేయడం చూసిన యువత ఈలలతో ఉత్సాహపరిచారు.


► Read latest West godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పొగాకు బ్యారెన్ దగ్ధం [ 17-02-2026] కొయ్యలగూడెం మండలం సీతంపేటలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బ్యారెన్ దగ్ధమైంది.
  • చుట్టేసిన విషాదం.. ఫ్యాను సెట్‌లో ఇరుక్కుని తల్లీకూతుళ్ల దుర్మరణం [ 17-02-2026] రొయ్యల చెరువు వద్ద తిరుగుతున్న ఫ్యాన్‌ సెట్‌లో ఇరుక్కుని తల్లీకూతుళ్లు దుర్మరణం పాలైన విషాద ఘటన ఇది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాసరావుకు కలిదిండిలోని వీర నాగ జ్యోతితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.
  • చూడాలా.. ఇంకెన్నేళ్లు [ 17-02-2026] అండలూరు లేఅవుట్‌లో 2014-19 మధ్య సుమారు 43 మంది ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు అప్పట్లో కొంతమొత్తం బిల్లు మంజూరైంది. మిగిలినది ఇప్పటి వరకు రాలేదు. 
  • కుళ్లిపోతున్నాయ్‌.. కుమిలిపోతున్నాయ్‌ [ 17-02-2026] ప్రాంతీయ ఆసుపత్రుల్లో శవాలు కన్నీళ్లు కార్చుతున్నాయి. శవాగారాలు సరిగ్గా ఉండవు. భద్రపరిచేందుకు ఫ్రీజర్లు ఉండవు. ఇవి ఉంటే పర్యవేక్షక సిబ్బంది ఉండరు. అరకొర వసతులున్న శవాగారాల్లో వదిలితే కుళ్లిపోతుంది. కొన్నేళ్లుగా ఇదే సమస్య. 
  • అమ్మా.. లో‘లోపల ఎంత ఏడుస్తున్నానో!’ [ 17-02-2026] అమ్మ కడుపులోనే పిల్లలు కన్ను మూస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక గర్భస్రావాలు జరుగుతున్న జిల్లాల్లో ఏలూరు ఒకటి. గతేడాది 1499 గర్భస్రావాలు జరిగాయని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్‌ కేంద్రాలపై కొరడా ఝుళిపించకుండా తాత్సారం చేస్తోంది.
  • ఇట్టే చూస్తారు.. అట్టే దోచేస్తారు [ 17-02-2026] ఉపాధి నిమిత్తం ఒడిశా నుంచి వచ్చిన ఓ వ్యక్తి భీమవరం ఒకటో పట్టణంలోని ఓ చిరు దుకాణానికి వెళ్లాడు. వృద్ధుడైన యజమాని ఒక్కరే ఉండటంతో అతనిపై దాడి చేసి డబ్బులు లాక్కెళ్లే యత్నం చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంబడించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
  • రండి.. మీరే పారిశ్రామికవేత్తలు [ 17-02-2026] సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు.. రాయితీలు ఇస్తోంది. అయినా అవగాహన లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు.
  • కన్నా.. ఇక కనిపించవా.. [ 17-02-2026] అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇక కళ్ల ముందు కనిపించడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది.
  • ‘దివ్య’మైన సేవ! [ 17-02-2026] పేద, సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీ మేరకు ‘ఇంద్రధనుస్సు’ పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
  • నిత్య సాధన.. విజయం తీరాన [ 17-02-2026] జేఈఈ మెయిన్స్‌లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో 99 పర్సంటైల్‌కుపైగా సాధించి ప్రతిభ కనబరిచారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం,
  • గల్ఫ్‌లో మహిళ మృతి.. కానిస్టేబుల్‌ సహా ఇద్దరిపై కేసు [ 17-02-2026] మంచి జీతం వచ్చే పనిని ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్‌ దేశానికి పంపి ఓ మహిళ మృతికి కారణమైన ఇద్దరిపై నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది.