TG News: ‘అన్నంలో విషం కలిపి చంపేయండి’.. హాస్టల్‌ వార్డెన్‌ ఆడియో సంభాషణ వైరల్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 03 Jan 2026 17:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ విచక్షణ మరిచారు. విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో రగిలిపోయాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి.. ‘నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.

ఏం జరిగిందంటే...

వార్డెన్ కిషన్ నాయక్ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కడ్పల్-సిర్గాపూర్ రహదారిపై బైఠాయించి వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక ఎస్సై మహేశ్, సర్పంచి శ్రీనివాసరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఏఎస్ డబ్ల్యూవో చందా శ్రీనివాస్‌కు వార్డెన్ తీరుపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ నాయక్... శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశారు. ఈ ఫోన్ సంభాషణ బయటికి రావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

► Read latest Medak Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జహీరాబాద్ పురపీఠం కాంగ్రెస్ కైవసం [ 17-02-2026] సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా యూనుస్, వైస్ ఛైర్‌ పర్సన్‌గా కొత్త కాపు శిరీషా రెడ్డి ఎన్నికయ్యారు.
  • కాంగ్రెస్ ‘పాంచ్’ పటాకా [ 17-02-2026] జిల్లాలో మున్సిపాలిటీల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగాయి. అత్యధికంగా ఐదు పుర పీఠాలను కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది.
  • మూడు ‘హస్త’గతం.. భారాస కోటాలో ఒకటి [ 17-02-2026] జిల్లాలోని మూడు బల్దియాల్లో హస్తం పాగా వేసింది. ఒక్కటే భారాస వశమైంది. కాంగ్రెస్‌ రెండు పురపాలికల్లో సొంతంగా అధ్యక్ష స్థానాలు దక్కించుకోగా, ఒక్క చోట భాజపా మద్దతుతో కైవసం చేసుకోవడం గమనార్హం.
  • హంగ్‌లో కింగ్‌లు! [ 17-02-2026] ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పురపాలికల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. 19 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. జహీరాబాద్, ఇంద్రేశంలో కోరం లేక ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా జరిగాయి.
  • నిజాయతీయే మా సొత్తు [ 17-02-2026] పక్కనున్న వారి జేబుల్లోనుంచి డబ్బులు, నగలు కాజేస్తున్న ఈ రోజుల్లోనూ.. పరుల సొమ్ముకు ఆశపడకుండా నిజాయతీగా ఉంటున్నారు కొందరు. ఎక్కడైనా విలువైన వస్తువులు దొరికితే వాటిని పోగొట్టుకున్న వారికి అందిస్తున్నారు.
  • పురపాలికలు.. ఇంతుల పరం [ 17-02-2026] జిల్లాలోని నాలుగు పురపాలికలకు ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్‌పర్సన్‌ల ఎన్నికలు సోమవారం జరగ్గా మొత్తం మహిళలే పాలనాపగ్గాలు చేపట్టారు. హుస్నాబాద్‌లో ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్‌ వచ్చినా వనితకే పీఠం ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ జనరల్‌లో ఎవరూ కాంగ్రెస్‌ నుంచి గెలవలేదు.
  • జగమేలు తల్లికి.. జనహారతి.. [ 17-02-2026] శివసత్తుల పూనకాలు, సిగాలు, పోతరాజుల విన్యాసాలు, పొర్లు దండాలు, భక్తుల జయజయ ధ్వానాలు, డప్పుచప్పుళ్లు, నృత్యాలతో ఏడుపాయల వనదుర్గమ్మ ప్రాంగణం మార్మోగింది. మహా శివరాత్రి జాతర రెండో రోజైన సోమవారం కొనసాగింది.
  • మల్లన్న సన్నిధి.. పెద్దపట్నం సందడి [ 17-02-2026] మహాశివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి సన్నిధిలో పెద్దపట్నం కార్యక్రమం కనులపండువగా కొనసాగింది. ఆదివారం సాయంత్రం నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉదయం వరకు పట్నం దాటే వేడుక సాగింది.
  • ఉత్కంఠ.. ఉద్రిక్తత [ 17-02-2026] తూప్రాన్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు రాగా, భారాస సభ్యులు 12 గంటలకు ప్రత్యేక బస్సులో వచ్చారు.