Venezuela airstrikes: వెనెజువెలా అధ్యక్షుడు మదురో మా కస్టడీలోనే: ట్రంప్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా- వెనెజువెలా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యూఎస్ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్‌పై భీకరదాడులు జరిపిన సంగతి తెలిసిందే (Venezuela airstrikes). వాటిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ధ్రువీకరించారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. వారిద్దరిని వెనెజువెలా వెలుపలకు తరలించినట్లు వెల్లడించారు.
దీనిపై అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నామని తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్‌లో భాగమైంది.
వారి ఆధారాలు ఇవ్వండి: ఉపాధ్యక్షుడు
తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనెజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ స్పందించారు. మదురో, ఆయన సతీమణి ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు.
1989 తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ ఏడాది పనామాపై దాడిచేసి, మిలిటరీ నేత మాన్యుయెల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది. ఈ పరిణామాల వేళ వెనెజువెలా పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది.
ఇక సైనిక దాడులు చేయబోం: అమెరికా
మదురో అమెరికా ( USA) కస్టడీకి చిక్కడంతో వెనెజువెలాలో తమ సైనిక చర్య పూర్తయిందని యూఎస్ సెనెటర్ మైక్ లీ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఈ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ చమురు కోసమే అమెరికా దాడులు చేయనుందని గతంలో వెనెజువెలా ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా.. గతంలోనే తాను దేశాన్ని వీడేందుకు సిద్ధమని మదురో (Nicolas Maduro) చెప్పినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. తాను, తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారని వాటి సారాంశం. యూఎస్ విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసులను మూసివేయడం వంటి వాటి గురించి వాషింగ్టన్ వద్ద ప్రస్తావించినట్లు వెల్లడించాయి
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 15:17 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.