IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. శ్రేయస్‌కు చోటు..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం త్వరలో భారత పర్యటనకు న్యూజిలాండ్ రానుంది. జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నాయి. కివీస్‌తో వన్డే మ్యాచ్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు కల్పించారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే అతను మ్యాచ్‌లు ఆడతాడు. గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైన సంగతి తెలిసిందే.
ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి హార్దిక్ పాండ్యకు (CoE) నుంచి క్లియరెన్స్ రాకపోవడం, టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కివీస్‌తో వన్డేలకు అతడికి విశ్రాంతి ఇచ్చారు. రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌ను జట్టులో కొనసాగించారు. రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. దేశవాళీల్లో సత్తా చాటుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమికి మరోసారి నిరాశే ఎదురైంది. వన్డే సిరీస్ తర్వాత జరిగే టీ20లకు భారత జట్టును ఇప్పటికే ఎంపిక చేశారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టునే ఆ సిరీస్‌లో కొనసాగించనున్నారు.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (వైస్‌కెప్టెన్*), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీశ్‌కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
న్యూజిలాండ్‌తో టీ20లకు భారత జట్టు:అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ భారత పర్యటన
జనవరి 11 తొలి వన్డే(వడోదర)
జనవరి 14 రెండో వన్డే(రాజ్‌కోట్)
జనవరి 18 మూడో వన్డే(ఇంందౌర్)
జనవరి 21 తొలి టీ20(నాగ్‌పూర్)
జనవరి 23 రెండో టీ20 (రాయ్‌పూర్)
జనవరి 25 మూడో టీ20 (గువాహటి)
జనవరి 28 నాలుగో టీ20 (విశాఖపట్నం)
జనవరి 31 ఐదో టీ20 (తిరువనంతపురం)
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- బాబూ.. మీరూ ‘బాధ్యత’ తీసుకోవాలి! టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసలైన కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది.
- కొలంబోలో హోటల్ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో దర్శనమిచ్చిన హార్దిక్ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్ వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
- టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది: హర్భజన్ సింగ్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్ విజయ కేతనం ఎగుర వేస్తుందని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు.
- పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
- మళ్లీ ‘శివరాత్రి’ మ్యాచ్.. ఫ్యాన్స్‌లో హైవోల్టేజ్ సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్ ఒకటి. ఇది యూఏఈలో ఆసీస్‌పై ‘డిజర్ట్ స్ట్రామ్’ ఇన్నింగ్స్‌తో పోటీపడుతూ మాస్టర్ బ్లాస్టర్ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
- జింబాబోయ్ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
- మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
- అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.
- లోటు డబ్బుకే.. ఆటకు కాదు అంతర్జాతీయ క్రికెట్ ఆడి పేరు సంపాదిస్తే.. కోట్లల్లో డబ్బొస్తుంది. కోట్లాది అభిమానుల ఆదరణా దక్కుతుంది. జీవితానికి ఏ లోటూ ఉండదు. భారత్ సహా చాలా క్రికెట్ దేశాల ఆటగాళ్ల విషయంలో ఇది నిజమే.
- కెనడాకు యూఏఈ పంచ్ టీ20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బోణీ కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో కెనడాకు షాకిచ్చి తొలి విజయం నమోదు చేసింది.
- ముకేశ్‌కు రజతం ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి సత్తాచాటాడు. టోర్నీ చివరి రోజు శుక్రవారం 25 మీటర్ల పిస్టల్ జూనియర్ల విభాగంలో 582 పాయింట్లతో రజతం సాధించాడు.
- భారత్‌కు రజతం ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియనషిప్ వీల్‌చైర్ విభాగంలో భారత్ తొలిసారి రజతం నెగ్గింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అల్ఫియా జేమ్స్, ప్రేమ్ కుమార్ జోడీ 6-21, 4-21తో క్యుజిమొ, యుటాంగ్ (చైనా) జంట చేతిలో ఓడింది.
- అర్ష్‌దీప్ స్థానంలో కుల్‌దీప్? భారత్- పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు పేసర్ అర్ష్‌దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భారత్ మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
- సంక్షిప్త వార్తలు రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్‌కు రియాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని శుక్రవారం ఫ్రాంచైజీ ప్రకటించింది.
- 100% స్ట్రైక్‌రేట్.. ఆసీస్‌కు జింబాబ్వే అర్థం కావడం లేదా? జింబాబ్వేను ఎదుర్కోవాలంటే ఆస్ట్రేలియాకు పెద్ద తలనొప్పిగా మారినట్టు ఉంది. టీ20 ప్రపంచ కప్‌ల్లో రెండు మ్యాచుల్లోనూ జింబాబ్వే విజయం సాధించింది.
- క్రీడా గ్రామంలో కండోమ్స్ కటకట.. మూడు రోజులకే 10 వేల ప్యాకెట్లు ఖతం! మిలాన్ కోర్టినా వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు క్రీడా గ్రామంలో ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.