Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ!.. ఫోన్ స్విచాఫ్ చేసిన వైకాపా నేత

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం.బాబు, ముల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి, మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్‌పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని.. దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపర్చారన్నది నేరాభియోగం.
దీనికి సంబంధించి వారం కిందట వంశీ నివాసానికి వెళ్లి, సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా.. ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం హాజరుకావాల్సి ఉన్నా.. రాలేదు. సునీల్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు వాయిదాకు రాలేదు. మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు. పరారీ నేపథ్యంలో పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- టన్ను బంగినపల్లి రూ.1.75 లక్షలు కాయకు కవర్లు కట్టి సాగుచేసిన బంగినపల్లి మామిడి రేటెంతో తెలుసా? టన్ను రూ.1.75 లక్షలు! గత కొన్నేళ్లతో పోలిస్తే టన్నుకు రూ.50 వేలకు పైగా అధికంగా దక్కుతోంది.
- రాజధానికి రాచబాట రాజధానికి రాచబాటలో మరో ముందడుగు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో అత్యంత కీలకమైన ఫేజ్-3 పనులు మొదలయ్యాయి.
- తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి కన్నుమూత కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవలో శృంగేరి పీఠానికి అనుబంధంగా నిర్వహిస్తున్న కాశీ తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు.
- విపక్షం విమర్శలపై ఆత్మరక్షణ ధోరణి వద్దు.. ఎదురుదాడే విపక్ష వైకాపా చేస్తున్న అడ్డగోలు విమర్శలపై ఇక ఆత్మరక్షణ ధోరణి వద్దని ఎదురు దాడి చేద్దామని మంత్రి నారా లోకేశ్ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు సూచించారు.
- అసెంబ్లీ మీడియా పాయింట్ ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలకు రక్షణ లేదు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై భయం, భక్తి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి’ అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
- కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయండి ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
- గృహగణన ప్రశ్నావళిలో ఓబీసీలను చేర్చండి జనగణన మొదటి దశలో భాగంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబోయే గృహగణన వివరాల సేకరణ కోసం కేంద్రహోంశాఖ జారీచేసిన 33 ప్రశ్నల జాబితాలో ఓబీసీలను చేర్చాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- తిరుగులేని శక్తిగా భాజపా కార్యకర్తల సామర్థ్యం మరింత పెంచి, సిద్ధాంతాలపై అవగాహన కల్పించి భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆ పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ అన్నారు.
- హర్షిత స్కూలు కేసులో నిందితులకు బెయిల్ నిబంధనలు సడలించొద్దు హర్షిత పాఠశాల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని శ్రీ హర్షిత ఇంగ్లిష్ మీడియం స్కూల్, జూనియర్ కళాశాల ఛైర్‌పర్సన్ నందిగం రాణి కుటుంబసభ్యులకు గతంలో జారీచేసిన బెయిల్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
- కొండకెళ్తేనే శ్రీవారి లడ్డూలు తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు ఇటీవల మూసివేయడంతో యాత్రికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
- మన బొగ్గు గనుల్లో త్వరలో కార్యకలాపాలు రాష్ట్రంలో ఉన్న రెండు బొగ్గు గనుల్లో కార్యకలాపాలు మొదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది.
- చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా యూఏఈ కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేయాలంటే గణనీయ మొత్తాన్ని సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
- పుష్ప శ్రీవాణి కులధ్రువీకరణ పత్రంపై మళ్లీ సవాల్ చేయొచ్చు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున పోటీచేసి గెలిచిన పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికను సవాల్‌చేస్తూ తెదేపా నాయకుడు నిమ్మక జయరాజ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ముగించింది.
- మండలిలో వైకాపా రచ్చ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా వైకాపా రాజకీయ చర్యలకే పాల్పడిందని కూటమి ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.
- పారిశ్రామికవేత్తలకు జగన్ బెదిరింపులు తగదు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పలువురు కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడారు.
- ప్రజాదర్బార్‌లో కొత్త పింఛన్లపైనే ఎక్కువ ఫిర్యాదులు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతువులకు త్వరగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కూటమి ఎమ్మెల్యేలు కోరారు.
- ఏపీలో 4.78 లక్షల సికిల్‌సెల్ స్టేటస్ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో పలు గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో సికిల్‌సెల్ వ్యాధి పరీక్షలు నిర్వహించి 4,78,188 మందికి జెనెటిక్ స్టేటస్‌కార్డులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు.
- వైకాపా ప్రభుత్వంలో హైందవ సంప్రదాయంపై దాడి వైకాపా ప్రభుత్వం హైందవ సంప్రదాయాన్ని దెబ్బతీసిందని భాజపా ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- జగన్ కదిలితే.. జనాలకు నరకమే ‘రాజకీయం ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా’ అని వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.
- మద్యం రవాణాలోనూ మహా దోపిడీ జగన్ జమానాలో మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. అప్పట్లో ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలోనూ మరో కుంభకోణానికి పాల్పడింది.