Ganta srinivasarao: అభిప్రాయ సేకరణ తర్వాతే రుషికొండ భవనాలపై తుది నిర్ణయం: ఎమ్మెల్యే గంటా

- A
- A+
- A++

విశాఖ: రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితరాలకు ఈ భవనాలను ఇవ్వాలని వివిధ సంస్థలు ప్రతిపాదించాయి. ఏడాదిన్నరగా నిర్వహణ లేకపోవడం వల్ల.. భవనాలు పాడైపోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందంటూ ఒక జంట సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాం. నిజం లేదని తేలితే వారిపై చర్యలు ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ సిబ్బంది నొచ్చుకునేలా మాట్లాడారని ఆరోపణ చేసిన జంట.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
వైకాపాలో ఉన్నవారికి భవిష్యత్ లేదు
వైకాపాలో ఉన్నవారికి ఎలాంటి భవిష్యత్ ఉండబోదని గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు ఆ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని దుష్ప్రచారం చేసి అడ్డుపడడం సరి కాదన్నారు. రప్పా.. రప్పా.. అంటూ మారణాయుధాలతో హల్ చల్ చేయడం, పుట్టినరోజు నాడు రక్తాభిషేకం చేయడం.. ప్రజలను భయాందోళనలకు గురి చేయడమేనని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా హయాంలో స్మశానంగా మార్చిన అమరావతిలో ఆంధ్రులు గర్వించే రాజధాని యుద్ధ ప్రాతిపదికన నిర్మితమవుతోందని చెప్పారు.
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘నౌకా’ సంరంభం..సాగర సంభ్రమం..! [ 18-02-2026] అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో భాగంగా ఆర్కేబీచ్ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బుధవారం నమూనా విన్యాసాలు నిర్వహించి, గురువారం పూర్తిస్థాయి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- శ్రమించారు.. సాధించారు! [ 18-02-2026] జేఈఈ మెయిన్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచి ప్రణాళిక.. ఉపాధ్యాయుల మార్గదర్శనం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. ఐఐటీ లక్ష్యంగా చదువుతున్నామని చెప్తున్నారు.
- సంద్రంలో ‘బలగం’.. శత్రు దుర్భేద్యం...! [ 18-02-2026] గాలిలో.. నీటిపైన.. సముద్రం అడుగున రక్షణ కవచంలా పనిచేసే ఆయుధ సంపత్తి తూర్పు నౌకాదళం ప్రత్యేకం. అందులో యుద్ధనౌకలతోపాటు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి
- ఉన్నత చదువులకు అండగా.. ‘విద్యా లక్ష్మి’! [ 18-02-2026] ఉన్నత చదువులకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ‘ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి’ పథకం ఆసరాగా నిలుస్తోంది.
- ‘మలుపు’ల్లో..అడుగడుగునా అక్రమాలు! [ 18-02-2026] రుషికొండ వద్ద నేరుగా వెళ్లాల్సిన రోడ్డు ఓ రిసార్టు, కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లేసరికి మెలికలు తెరిగింది. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్యుల ఆస్తుల మీదుగా అలైన్‌మెంట్ వెళ్లేలా చేశారు.
- ఇక తరగతులకు డుమ్మా కొట్టలేరు..! [ 18-02-2026] అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సక్రమంగా తరగతులు, విధులకు హాజరయ్యేలా ఆంధ్రవిశ్వవిద్యాలయం చర్యలకు ఉపక్రమించింది
- నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల [ 18-02-2026] గత ప్రభుత్వంలో నాయకులు అందిన కాడికి జేబులు నింపుకొనే ప్రయత్నాల్లో భాగంగా రోడ్ల నిర్మాణాల్లో అధికారులతో కలిసి నాణ్యతకు నీళ్లొదిలేశారు. దాని ఫలితం ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
- పరిశ్రమల ప్రవాహం.. ఉపాధికి ప్రోత్సాహం [ 18-02-2026] కూటమి పాలనలో జిల్లాకు పారిశ్రామిక కళ వచ్చింది. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పరిశ్రమలు, ఉపాధిపై దృష్టిసారించడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది.
- కనుమరుగైపోతున్నా.. కన్ను తెరవరా..? [ 18-02-2026] పెందుర్తి మండలంలోనే అత్యధికంగా ధర పలుకుతున్న భూములున్న సుజాతనగర్ కాలనీ సమీప రాజుచెరువు కనుమరుగైపోయే దుస్థితి నెలకొంది.
- కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.