Hyderabad: హోంగార్డును కారుతో ఢీ కొట్టి.. డ్రైవర్ పరారీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మాదాపూర్: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డును కారుతో వేగంగా ఢీ కొట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటు చేసుకుంది. సిగ్నల్ వద్ద ఉన్న హోంగార్డు నయీమ్ (45)ను అటువైపుగా అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన హోంగార్డును అక్కడున్న వారు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :