ఖమ్మంలో ముగిసిన ‘ఈనాడు క్రికెట్ లీగ్-2025’ పోటీలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఖమ్మం (క్రీడా విభాగం): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈనాడు- ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ప్రజెంట్స్ ‘ఈనాడు క్రికెట్ లీగ్-2025’ జిల్లాస్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. తుది పోరులో సీనియర్స్ విభాగం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో, ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్స్ విభాగంలో ఖమ్మం హార్వెస్ట్ కళాశాల ప్రథమ స్థానంలో నిలువగా, కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బహుమతులు ప్రదానం చేశారు. ముగింపు వేడుకల్లో ధనిక్ భారత్ ఏజీఎం రాంప్రసాద్, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అప్పిరెడ్డి, విజయ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ ఉషాకిరణ్, ఈనాడు ఖమ్మం యూనిట్ ఇన్‌ఛార్జ్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.



గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.