సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థంగా పని చేయాలి: డీఎస్పీ

Eenadu icon
By Telangana Dist. Team Published : 30 Dec 2025 15:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

వెల్దండ గ్రామీణం: ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారనే భరోసా కల్పించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వెల్దండ పోలీస్‌ స్టేషన్‌ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన పెండింగ్ కేసులు, నేరాల రికార్డులు, కేసుల నమోదు, పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి ఎస్సై కురుమూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన చేధించాలని ఆదేశించారు. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థంగా పని చేయాలని సూచించారు. ఠాణాలకు న్యాయం కోసం వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించేలా పోలీసులు వ్యవహరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.

► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నాణ్యమైన భోజనం అందించాలంటూ విద్యార్థుల ధర్నా [ 18-02-2026] నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో భోజనం బాగోలేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.
  • ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు [ 18-02-2026] మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు రోజులాగే మంగళవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టరు ఉంచి ఇంటికి వచ్చాడు.
  • పుర పీఠంపై ఇంతింతై [ 18-02-2026] మహిళలు రాజకీయాల్లోనూ ముందడుగు వేసి రాణిస్తున్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచులు, ఉపసర్పంచులుగా గెలిచి పల్లె పాలనలో సత్తా చాటుతున్నారు.
  • పాలమూరుకు మణిహారం [ 18-02-2026] పేదల తిరుపతి మన్యంకొండ వేంకటేశ్వరాలయం ఎన్‌హెచ్‌ నుంచి కి.మీ. ఉంటుంది. దేవరకద్ర నుంచి కురుమూర్తి దేవస్థానం 25 కి.మీ. మాత్రమే.
  • నిరంతర‘గంగా’ [ 18-02-2026] గండీడ్‌ మండలం సల్కర్‌పేట్‌ శివారులోని అంతరగంగ లింగేశ్వర ఆలయం వద్ద ఉన్న గుండంలో ఇప్పటి వరకు ఎండలేదు. లోతు చాలా తక్కువ. ఎంతటి కరవు పరిస్థితులు వచ్చినా నీటి మట్టం తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు.
  • వాహనాలు తెలిసేలా... ప్రమాదాలు ఆగేలా [ 18-02-2026] రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో రాత్రివేళ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలొదులుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
  • పారుతోంది కన్నీరే! [ 18-02-2026] గ్రామాల్లో సాగునీటి కాల్వలు అధ్వానంగా మారాయి. ఏళ్ల పాటు నిర్వహణ లేకపోవడంతో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు.
  • పెద్ద పులి దాడిలో లేగదూడ మృత్యువాత [ 18-02-2026] పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన మండలంలోని గుంపన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. అటవీశాఖ సెక్షన్‌ అధికారి బాలకిష్టయ్య వివరాల ప్రకారం..
  • పథకానికి ఏడాది.. నిధుల జాడేది..? [ 18-02-2026] రాష్ట్ర ప్రభుత్వం నేతన్న పొదుపు(త్రిఫ్టు ఫండ్‌) పథకం అమలు కోసం ఏడాది కిందట అధికారుల ద్వారా సర్వే చేయించి, మార్చి నుంచి పథకాన్ని అమలు చేసింది.
  • అన్న దుకాణానికి సోదరి నిప్పు [ 18-02-2026] ఆస్తి తగాదా నేపథ్యంలో అన్న కిరాణా దుకాణానికి చెల్లెలు నిప్పు పెట్టిన ఘటన చిన్నచింతకుంటలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
  • గుట్టుగా.. భ్రూణ హత్యలు! [ 18-02-2026] శ్రీరంగాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పెళ్లికాని యువతిని ఓ యువకుడు గర్భవతిని చేశాడు. కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు.