Starved to Death: ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె!

Eenadu icon
By National News Team Published : 31 Dec 2025 00:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. సంరక్షణ కోసం నియమించుకున్న ఓ జంట.. యజమాని, మానసిక వికలాంగురాలైన ఆయన కుమార్తె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. యజమాని ఇంట్లోనే ఉంటూ వారినే ఐదేళ్లుగా నిర్బంధించింది. ఈ క్రమంలో ఆ వృద్ధుడు చనిపోగా.. ఆయన కుమార్తె ఎముకల గూడుగా మారినట్లు తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

యూపీలోని మహోబా జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్‌ రాథోడ్‌ (70) రైల్వేలో సీనియర్‌ క్లర్క్‌గా పనిచేసి 2015లో పదవీ విరమణ చేశారు. మరుసటి ఏడాది ఆయన భార్య చనిపోగా.. మానసిక వికలాంగురాలైన కుమార్తె రష్మీతో మహోబాలో నివాసం ఉంటున్నారు. ఆయనకు వంట చేయడం రాకపోవడంతో, సంరక్షణ కోసం రాం ప్రకాశ్‌, రమాదేవి దంపతులను పనిలో పెట్టుకున్నారు. వారి పరిస్థితులను గమనించిన ఆ జంట.. యాజమాని, ఆయన కుమార్తెను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గదుల్లో నిర్బంధించింది. కుటుంబసభ్యులు, బంధువులు చూడడానికి వచ్చినప్పుడల్లా.. ఓం ప్రకాశ్‌ ఎవర్నీ కలిసేందుకు ఇష్టపడటం లేదని చెబుతూ తిప్పి పంపించేవాళ్లని సమాచారం.

ఓం ప్రకాశ్‌ మరణంతో..

తీవ్ర అనారోగ్యానికి గురైన ఓం ప్రకాశ్‌ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకొని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడి భయానక పరిస్థితులను చూసి షాక్‌కు గురయ్యారు. ఓం ప్రకాశ్‌ శరీరం కృశించిపోగా.. ఆయన కుమార్తె చీకటి గదిలో ఉన్నట్లు గుర్తించారు. ఎముకలగూడుగా మారిన రష్మీని చూసి షాక్‌కు గురయ్యారు. ఓం ప్రకాశ్‌ ఎప్పుడూ హుందాగా, సూట్‌లో కనిపించేవారని, ఇప్పుడు ఈ స్థితిలో చూసి జీర్ణించుకోలేకపోతున్నామని స్థానికులు చెప్పారు.

ముప్పై ఏళ్ల రష్మీ 80 ఏళ్ల వృద్ధురాలిగా తయారైందని, కేవలం అస్థిపంజరం శ్వాస తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని ఓం ప్రకాశ్‌ సోదరుడు వాపోయారు. డబ్బు, ఆస్తి కోసమే ఇలా చేశారని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు..  అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆ ఇంటి విద్యుత్‌ కనెక్షన్‌ను సంరక్షకులు తమ పేరు మీదకు మార్పించుకున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల సమస్యతో ఓం ప్రకాశ్‌ చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందన్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు చేసి..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
  • మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
  • ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
  • నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
  • కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు బోగస్‌ అని తేలింది.
  • ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
  • పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
  • ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
  • 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
  • దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవీ ప్రసాద్‌ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
  • సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ మంగళవారం భారత్‌ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
  • ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి. 
  • ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్‌ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్‌ నాగేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
  • వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్‌ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
  • ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్‌ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్‌ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.
  • 22 ఏళ్ల క్రితం అదృశ్యమై… మళ్లీ కుటుంబం చెంతకు! మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్ల క్రితం అదృశ్యమై... 44 ఏళ్ల వయసులో కుటుంబాన్ని కలుసుకున్నారు.
  • నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/02/2026)  ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
  • పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారో?: సుప్రీంకోర్టు ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.