Anil Ravipudi: దిష్టి తీయించుకోమని చిరంజీవికి చెప్పా: అనిల్ రావిపూడి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఈ సంక్రాంతికి రానున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తాడని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది (Mana Shankaravaraprasad Garu). జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా నేడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. గుంటూరులో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో అనిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూస్తారు. ఆయన ఈ చిత్రం కోసం ఎంతో శ్రమపడి లుక్ మార్చుకున్నారు. చూసినవారంతా చరణ్‌కు తమ్ముడా అని అడుగుతున్నారు. ఈ సినిమాకు ఆయన లుక్ అలా రావడం నా అదృష్టం. ఇండస్ట్రీకి చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున నాలుగు మూలస్తంభాలు. వీరిలో ఏ ఇద్దరు కలిసి నటించినా అది గొప్పగా ఉంటుంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకటేశ్, చిరంజీవి కలిసి సందడి చేస్తారు’’ అని చెప్పారు.
చిరంజీవి (Chiranjeevi) లుక్ గురించి చెప్పండి?
అనిల్ రావిపూడి:ఈ సినిమాలో కొత్తగా కనిపించడం కోసం చిరంజీవి పడిన శ్రమ తెరపై అందరికీ కనిపిస్తుంది. సెట్‌లో అందరూ ఆయన యూత్‌ఫుల్‌గా ఉన్నారని చెబుతుండేవారు. అందుకే రోజూ దిష్టి తీయించుకోండి అని చిరంజీవికి చెప్పాను.
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి కదా?ఏం చెబుతారు?
అనిల్ రావిపూడి: సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి ‘రాజాసాబ్’తో సందడి మొదలవుతుంది. దానికోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. వాళ్లు ప్రారంభించిన పండగ సందడిని మేం కొనసాగిస్తాం.
రివ్యూలపై మీ అభిప్రాయం ఏంటి?
అనిల్ రావిపూడి: సినిమాను ఆదరించాలా, లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. రివ్యూలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వాళ్లను నేను ఎప్పుడూ తప్పు పట్టను. ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం.
- రిద్ది కుమార్‌కు శారీ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. అసలు విషయమిదే..!
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ను ఎలా చూస్తారు?
అనిల్ రావిపూడి: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఫ్యాన్ వార్‌లు సాధారణం అయ్యాయి. ఏ హీరో సినిమా విడుదలైనా అవి జరుగుతూనే ఉంటాయి. అందుకే ట్రోల్ చేస్తుంటారు. వాటికి మనం స్పందించకుండా ఉంటే బాగుంటుంది. ఒకప్పుడు మనం అందరి చిత్రాలను ఆదరించాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక ఈ ట్రోలింగ్ ఎక్కువైంది.
శివాజీ కామెంట్స్‌పై మీరేమంటారు?
అనిల్ రావిపూడి: ఆ కామెంట్స్ సున్నితమైన అంశానికి సంబంధించినవి. A-Z అందరూ దాని గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నేను ఒకటి చెబితే అది నచ్చనివాళ్లు నాపై దాడి చేస్తారు. ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. నా పని నేను చేసుకుంటూపోతుంటాను. ఎవరైనా నా వల్ల బాధ పడితే వాళ్లకు సారీ చెప్పి ముందుకుపోవడం నా మనస్తత్వం. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించడంలో తప్పు లేదు. ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలపై స్పందించి మన అభిప్రాయాలు చెప్పడం సరైన పద్ధతి కాదు.
రాజాసాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ స్టేట్‌మెంట్ మీకు ఎలా అనిపించింది?
అనిల్ రావిపూడి: ‘పెద్ద హీరోల తర్వాతే మేము’ అని అనడం ప్రభాస్ గొప్పతనానికి నిదర్శనం. అలా ఆలోచిస్తారు కాబట్టే ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మేమందరం ‘రాజాసాబ్’ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ మూవీనా?.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ‘వారణాసి’ జానర్‌పై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
- వైబ్ మ్యాచ్ అయితేనే పెళ్లి.. జెన్-జీకి లావణ్య త్రిపాఠి సలహా ప్రెగ్నెన్సీతోనే ‘సతీ లీలావతి’ సినిమా మొత్తం పూర్తి చేశానని లావణ్య త్రిపాఠి అన్నారు.
- వీఎఫ్‌ఎక్స్.. తొందరపడితే ప్రేక్షకులు క్షమించడం లేదు: నిఖిల్ ‘‘పేర్లు చెప్పను కానీ, వీఎఫ్‌ఎక్స్ విషయంలో కొన్ని సినిమాలు తొందరపడ్డాయి. వాటికి చాలా నష్టం జరిగింది. ‘స్వయంభు’ (Swayambhu) చిత్రానికి అలా జరగకూడదనే ఆలస్యమైనా మంచి అవుట్‌ఫుట్‌తో వస్తున్నాం’’
- ‘ప్రిన్స్’ అందుకే ఆడలేదు.. ‘ఫంకీ’ విషయంలో అలా జరగదు: కేవీ అనుదీప్ ‘‘మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే ప్రేక్షకులకు చేరువ అవుతాం’’అంటున్నారు దర్శకుడు కేవీ అనుదీప్.
- అందుకే.. మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని చెప్పాను: గుణశేఖర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.
- రాముడిగా కనిపిస్తాను..: ‘వారణాసి’లో తన పాత్ర గురించి చెప్పిన మహేశ్ ‘వారణాసి’లో నటించడానికి మొదట భయపడినట్లు మహేశ్ బాబు వివరించారు.
- పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ నిర్ణయం.. కుమార్తె స్పందన ఇదీ! సౌందర్యా రజనీకాంత్ నిర్మించిన సినిమా ‘విత్ లవ్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంపై ఆమె స్పందించారు.
- తరుణ్ భాస్కర్ ఆ సీన్‌లో నిజంగానే చెంపదెబ్బ కొట్టారు: ఈషా రెబ్బా కెరీర్‌లో ఒక్కసారైనా శాంతిలాంటి పాత్ర చేయాలని అనుకునేదాన్నని.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’తో (Om Shanti Shanti Shantihi) ఆ కోరిక నెరవేరిందని అంటోంది ఈషా రెబ్బా (Eesha Rebba).
- ‘ఖైదీ 2’ అప్పుడే.. ‘ఎల్‌సీయూ’ ఆగిపోలేదు..: లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ‘ఖైదీ 2’పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు.
- పవన్‌కల్యాణ్‌తో మూవీపై క్లారిటీ.. టైటిలే విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రం కూడా 200శాతం ఎంటర్‌టైనరేనని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా మూవీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu).
- అలాంటి లెక్కలు వేసుకోను! ‘గూఢచారి’, ‘మేజర్’ విజయాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి శోభితా ధూళిపాళ్ల. ఇప్పుడామె తొలిసారి తెలుగులో ‘చీకటిలో’ అనే ఓటీటీ చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. దీన్ని శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించగా.. డి సురేశ్‌బాబు నిర్మించారు.
- ‘యుఫోరియా’.. అందుకే నాపై కోపం వస్తుంది: గుణశేఖర్ తన కొత్త సినిమా ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- ‘మన శంకరవరప్రసాద్‌గారు’కు చిరంజీవి పారితోషికం.. అనిల్ ఏమన్నారంటే? చిరంజీవితో సినిమా అనుకున్న తర్వాత ఆయనకు తనకూ ఓ మినీ ఛాలెంజ్ జరిగిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.
- తొలిరోజే సెట్‌లో ఏడ్చేశా.. ‘ ‘గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని పండగ విజయాన్ని అందుకున్నా. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నమ్మకముంది’’ అంటోంది నటి మీనాక్షి చౌదరి.
- అందుకేనేమో నయన్ ప్రమోషన్స్ చేశారు.. అది మెగా మ్యాజిక్: అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు ఉన్నా, అలా ముద్ర పడటం మంచిది కాదని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
- నేను కారణజన్మురాలిని.. ఫ్యాన్స్ అసోసియేషన్‌పై అనసూయ కామెంట్.. స్వేచ్ఛ మనకు మనం ఇచ్చుకునేదని, స్వాతంత్ర్యం బయట నుంచి వచ్చేదని నటి, వ్యాఖ్యాత అనసూయ అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో ముచ్చటించారు.
- మెగాస్టార్‌తో పోటీ.. నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే! తనకు సినిమాల్లోనే పెళ్లి చేసుకోవాలని రాసి ఉన్నట్లుందని నవీన్ పొలిశెట్టి సరదాగా అన్నారు.
- ఆ రోల్‌కు సందీప్ రెడ్డి వంగాను అనుకున్నా.. కానీ: ‘పతంగ్’ డైరెక్టర్ ‘పతంగ్’ సినిమా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు.
- అమ్మ కేవలం నటిస్తోంది.. సరేనా? పరిశ్రమ ఏదైనా పని విషయంలో ఒత్తిడి చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అంటోంది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. ఈ మధ్య కాలంలో యాక్షన్ కథల్లో మెరుస్తూ అలరిస్తున్న కథానాయికీమె.
- ‘శంబాల’.. అసలైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: ఆది సాయి కుమార్ ప్రస్తుతం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలని, అది ‘శంబాల’లో కావాల్సినంత ఉందని యువ కథానాయకుడు ఆది సాయికుమార్ అన్నారు.