Vijay Hazare Trophy 2025-26: బాప్‌రే.. బిహార్‌!.. 574 పరుగుల రికార్డ్‌ స్కోర్‌ నమోదు.. అరుణాచల్‌ ప్రదేశ్‌పై భారీ విజయం

Eenadu icon
By Sports News Team Updated : 24 Dec 2025 17:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాంచీ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బిహార్‌ 397 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన బిహార్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో రికార్డు స్థాయిలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇది విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌. ఇంతకుముందు ఆ రికార్డ్‌ తమిళనాడు పేరిట ఉంది. ఆ జట్టు 21 నవంబర్‌ 2022లో అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 506 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ రికార్డ్‌ను బిహార్‌ బ్రేక్‌ చేసింది. రెండు సందర్భాల్లోనూ ప్రత్యర్థి జట్టు అరుణాచల్‌ప్రదేశ్‌ కావడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టు 42.1 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది.

బిహార్‌ బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) (190; 84 బంతుల్లో, 16 ఫోర్లు, 15 సిక్స్‌లు), ఆయుష్‌ లోహరుక (116, 56 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), సకిబుల్‌గని (128*;40 బంతుల్లో, 10 ఫోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగిపోయారు. పీయూష్‌ సింగ్‌ (77; 66 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీ సాధించాడు. దీంతో బిహార్‌ జట్టు భారీ స్కోర్‌ చేయగలిగింది. బిహార్‌ బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేస్తే, సకిబుల్‌ గని 32 బంతుల్లోనే శతకం బాదాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో తడకమల్ల మోహిత్‌ , టెక్కీ నేరి తలో రెండు, ధీరజ్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. కామ్షా యాంగ్ఫో (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బిహార్‌ బౌలర్లలో ఆకాశ్‌ రాజ్‌, సూరజ్‌ కశ్యప్‌ తలో 3, హిమాన్షు తివారీ 2, సబీర్‌ ఖాన్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.  

  • విజయ్‌ హజారేకు స్టార్‌ కళ

ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ సెంచరీ..

అహ్మదాబాద్‌ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్‌ తరఫున బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌ ( Ishan Kishan) 33 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడు చివరికి 39 బంతుల్లో 125 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరాడు. ఇందులో 7 ఫోర్లు, 14 సిక్స్‌లు ఉన్నాయి. జార్ఖండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. కర్ణాటకకు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 13:37 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8... మిగిలిన రెండు బెర్తులు ఎవరికి? టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 దశకు ఆరు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 
  • రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌ హాఫ్‌ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అభిషేక్‌ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్‌ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
  • యువరాజ్‌ సమ్రా సూపర్‌ సెంచరీ.. న్యూజిలాండ్‌ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచిన కెనడా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
  • గౌతమ్‌ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్‌ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్‌ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
  • తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
  • తూచ్‌.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్‌ అక్తర్‌! పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్‌ తీసుకున్నాడు.
  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.