Jemimah Rodrigues: జెమీమా 2.0.. రెండు నెలల్లో మారిపోయిన కెరీర్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రెండు నెలల ముందు వరకు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అంటే.. భారత మహిళల క్రికెట్ జట్టులో మిగతా ప్లేయర్లలాగే ఆమె కూడా ఒకరు. ఆమెను ‘స్టార్’ అని చెప్పలేని పరిస్థితి. టీమ్ ఇండియాలో ( Team India) ఆమెకు సుస్థిర స్థానమేమీ లేదు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా జెమీమా టాప్ ప్లేయర్ ఏమీ కాదు. కానీ ఇప్పుడు ఆమె భారత జట్టు సూపర్ స్టార్లలో ఒకరు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ( WPL) ఆమె కెప్టెన్‌గా ఒక జట్టును నడిపించబోతోంది. తన కోసం బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. ఇంతలోనే ఒక ప్లేయర్ కెరీర్లో ఇంత మార్పు రావడం అనూహ్యం.
కొన్ని నెలల ముందు వరకు జెమీమా కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఆమెకు ఏ ఫార్మాట్లోనూ భారత జట్టులో సుస్థిర స్థానం లేదు. నిలకడ లేమి వల్ల జట్టులోకి వస్తూ పోతూ ఉండేది. ఏడేళ్ల కిందటే భారత జట్టులోకి వచ్చినప్పటికీ.. కెరీర్ ఆరంభంలో కొన్ని మెరుపుల తర్వాత నిలకడ తప్పింది. దీంతో గత వన్డే ప్రపంచకప్ (2021)లో ఆమెకు అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు. రెండేళ్లుగా తన ప్రదర్శనలో కొంచెం మెరుగుపడ్డా.. తుది జట్టులో స్థానం ఖాయం కాని పరిస్థితి. అక్టోబరులో వన్డే ప్రపంచకప్ మొదలయ్యాక కూడా గ్రూప్ దశలో ఆమెపై ఒక మ్యాచ్‌లో వేటు పడింది. అప్పటికి జట్టులో ఆమెకు అంత ప్రాధాన్యం లేదు. వన్డేల్లో జెమీమా సగటు 35 కాగా.. టీ20ల్లో 30కి దగ్గరగా ఉండేది. హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur), స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ (Shafali Verma) మాదిరి ఆమె స్టార్ ఇమేజ్ సంపాదించలేకపోయింది. కానీ, ఇదంతా వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ జరగడానికి ముందు కథ.
ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో..
2025 నవంబరు 2.. భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆ రోజే హర్మన్‌ప్రీత్ సేన మహిళల వన్డే ప్రపంచకప్‌ను (ICC Womens World Cup) సొంతం చేసుకుంది. అయితే జెమీమాకు కూడా ఈ తేదీ ఎంతో ప్రత్యేకమైందే కానీ.. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన ఇంకో ముఖ్యమైన తేదీ ఉంది. అదే.. 2025 అక్టోబరు 30. ఆ రోజు జెమీమా ఆడిన ఆ ఒక్క ఇన్నింగ్స్ తనలో తనే గుర్తించని అపారమైన ప్రతిభను బయటికి తీసింది. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత జట్టు 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో జెమీమా అద్భుత శతకానిది (127 నాటౌట్) అత్యంత కీలక పాత్ర. తనవల్లే ఆ రోజు ఇండియా గెలిచి ఫైనల్‌కు చేరింది. తుది పోరులోనూ అద్భుత విజయం సాధించడంతో కప్పు భారత్ సొంతమైంది. ఆస్ట్రేలియాపై జెమీమా ఆడిన ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచంలో తన పేరు మార్మోగింది.
అయితే ప్రపంచకప్ ప్రదర్శన గాలివాటం కాదని రుజువు చేస్తూ.. ఆ టోర్నీ తర్వాత కూడా జెమీమా జోరు కొనసాగిస్తోంది. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో జెమీమా అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 69 పరుగులతో అజేయంగా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికైంది. రెండో మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడి 15 బంతుల్లో 26 పరుగులు చేసింది. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం, దూకుడు తన ఆటలో కనిపిస్తోంది. లంకపై చెలరేగుతున్న సమయంలోనే జెమీమాకు తీపి కబురు అందించింది దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ. వచ్చే సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్‌లో డీసీకి (WPL Delhi Capital) జెమీమానే కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ ఆ జట్టును నడిపించింది. ఇప్పుడు 25 ఏళ్లకే జెమీమా ఆ జట్టు పగ్గాలు అందుకుంది. సీనియర్ స్థాయిలో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న జెమీమా.. తన నాయకత్వ లక్షణాలతో ఎలా మెప్పిస్తుందన్నది ఆసక్తికరం. ఇక్కడ సత్తా చాటుకుంటే భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు కూడా చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. ప్రస్తుత సారథి హర్మన్‌ప్రీత్ 37వ పడికి చేరువగా ఉంది. ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చినట్లే. ఇంక ఎంతోకాలం ఆమె ఆటలో కొనసాగకపోవచ్చు. వైస్ కెప్టెన్ స్మృతి తన తర్వాత కెప్టెన్ కావచ్చు. అయితే ఆమె కూడా 30వ పడిలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో సారథి కావడానికి జెమీమాకు మంచి అవకాశాలున్నట్లే.
బ్రాండ్ వాల్యూ ట్రిపుల్
ప్రపంచకప్ విజయానంతరం బ్రాండ్ విలువ అమాంతం పెరిగిన క్రికెటర్లలో జెమీమా కూడా ఒకరు. అంతకుముందు కూడా ఆమె కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేసేది. కానీ ప్రపంచకప్ తర్వాత రెండంకెల సంఖ్యలో కొత్త ఒప్పందాలు చేసుకుంది జెమీమా. ఒక్కో బ్రాండ్ ప్రచారానికి ఆమె అందుకునే పారితోషకం మూడు రెట్లయిందట. ప్రస్తుతం హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన తర్వాత జట్టులో పెద్ద స్టార్ జెమీమానే. మిగతా ఇద్దరిలాగే మూడు ఫార్మాట్లోనూ ఆమె జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మేటి బ్యాటర్‌గానే కాక జట్టులో ఉత్తమ ఫీల్డర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచకప్‌తో ఆమె ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది. ప్రస్తుతం తన ఊపు చూస్తుంటే కెరీర్లో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగేలాగే కనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 11:05 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్ అశ్విన్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.