Chandrababu: పీపీపీ విధానంపై ముందుకే.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 24 Dec 2025 20:02 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పీపీపీ విధానంపై ముందుకేనని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు వీజీఎఫ్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. వీజీఎఫ్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం చొప్పున ఆర్థిక మద్దతు ఉంటుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆదోని మెడికల్ కాలేజ్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :