Harish Rao: అరెస్టు చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా

Eenadu icon
By Telangana News Desk Updated : 24 Dec 2025 06:53 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రం తెచ్చిన వాళ్లం.. త్యాగాల చరిత్ర మాది. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు’ అని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్‌ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్‌ కేసుల పేరిట లీకులు ఇస్తూ.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన పలు అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. ఈ కేసులో తాజాగా వేసిన సిట్‌ ఒక పెద్ద జోక్‌. రేవంత్‌ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. ఏపీలో అధికారులకు పట్టిన గతే వారికీ పడుతుంది. అరెస్టు చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా. ఉద్యమంలో నాపై 300 కేసులు ఉన్నాయి. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం’ అని అన్నారు. ఇటీవల కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని, ఆయన మాట్లాడిన అంశాలపై ఒక్క దానికి కూడా సీఎం సహా మంత్రులెవరూ సరైన సమాధానం చెప్పలేదని విమర్శించారు. ‘‘25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్‌చాట్‌ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారంటే అదీ... కేసీఆర్‌ పవర్‌. 4,000 మందికి పైగా భారాస మద్దతుదారులు సర్పంచులుగా గెలవడంతో రేవంత్‌రెడ్డికి ఓటమి భయం మొదలైంది. అందుకే కో ఆపరేటివ్‌ ఎన్నికలు పెట్టకుండా.. కాంగ్రెస్‌ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారు.  

జీహెచ్‌ఎంసీని 3 ముక్కలు చేయాలని..

రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించాలి. శాసనసభలో సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నాం. కానీ వాస్తవాలు చెప్పడానికి భారాసకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలి. సీపీఐ, ఎంఐఎం, భాజపాల కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ... మా గొంతు నొక్కుతున్నారు. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ.30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ.7,000 కోట్లను మంత్రులు భట్టి, ఉత్తమ్‌ పంచుకున్నారు. 20 శాతం కమీషన్‌ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ నీటిని వాడినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. వాస్తవానికి 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ కృష్ణా జలాల్లో నీటి వాడకం కేవలం 28.49 శాతం మాత్రమే. తెలంగాణకు 45 టీఎంసీలు చాలు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 06:52 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హస్తానికి ‘పుర’స్కారం పట్నం ‘చెయ్యె’త్తి జై కొట్టింది.. పుర ఎన్నికల్లో హస్తానికే పట్టం కట్టింది. ఏడింట ఆరు కార్పొరేషన్లు, మూడొంతులకు పైగా మున్సిపాలిటీలను ‘చే’జిక్కించుకునేంతగా అధికార పార్టీ సత్తా చాటింది. 52 శాతానికి పైగా మున్సిపల్‌ వార్డులను చేజిక్కించుకుని.. ‘పీఠా’ధిపత్యం దిశగా పావులు కదుపుతోంది.
  • సతీసమేత విజయం.. పలుచోట్ల భార్యాభర్తల గెలుపు రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన పుర పోరులో పలుచోట్ల భార్యాభర్తలు గెలుపొందారు. జంటగా పుర, నగరపాలికల్లోకి అడుగుపెట్టనున్నారు. మరికొన్ని చోట్ల అత్తాకోడళ్లు, తండ్రీకుమారులు, తల్లీకుమారుడు గెలుపొందారు. 
  • ఫలించిన సీఎం వ్యూహం ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయ దుందుభి మోగించి కాంగ్రెస్‌ పట్టు సాధించింది. నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందు నుంచీ పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది.
  • ఒక్క ఓటు మ్యాజిక్‌ ‘పుర’ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉత్కంఠగా సాగింది. విజయం దోబూచులాడిన చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో చాలామంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. 
  • వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్‌.. వరుస విజయాలు కాంగ్రెస్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు నగర..
  • మేయర్, ఛైర్‌పర్సన్‌ పదవులకు16న ఎన్నికలు తెలంగాణలో ‘పుర’ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఏడు నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, 116 పురపాలికల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది.
  • లక్షల మంది కార్యకర్తల శ్రమ ఫలితమిది ‘రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
  • మాకు ఓట్లు పెరిగాయి పుర ఫలితాలతో తాము సంతృప్తికరంగా ఉన్నామని, తమకు ఓట్లు, సీట్లు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్, మజ్లిస్, భారాస ఒక్కటై భాజపా గెలవకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.
  • ‘తిరుగుబాటు’తో తడబాటు తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో తిరుగుబావుటా ఎగురవేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
  • స్వీపర్‌గా పని చేసి..కౌన్సిలర్‌గా గెలిచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో సుదీర్ఘకాలం స్వీపర్‌గా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందిన ఇంజమూరి వెంకటమ్మ కౌన్సిలర్‌గా గెలిచి ఔరా అనిపించారు.
  • పురపాలికల్లో కాంగ్రెస్‌కే పట్టం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 50 శాతానికిపైగా వార్డులతో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మరో ఐదు మున్సిపాలిటీల్లో సగం వార్డులు సాధించింది.
  • ఇక్కడా లెక్కింపు కోలాహలమే! కొత్తగూడెం నగరపాలిక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం నెలకొన్న కోలాహలమిది. పాల్వంచ పట్టణంలోని అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా..
  • కార్పొరేషన్లలో భారాసకు చుక్కెదురు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి (భారాస)కు చుక్కెదురైంది. ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలోనూ పార్టీ నామమాత్రపు పోటీ ఇచ్చింది.
  • పండుగ..సందడి హైదరాబాద్‌ శివారు బాట సింగారం మార్కెట్‌కు వివిధ రకాల పండ్లు తీసుకొచ్చిన వాహనాలతో జాతరను తలపిస్తున్న దృశ్యమిది.
  • పార్టీల క్యాంప్‌ ఫైర్‌ రాష్ట్రవ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాల్టీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు వేడెక్కాయి.
  • నేడు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం రాష్ట్రమంత్రివర్గం శనివారం సమావేశం కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
  • బజ్జీల విక్రేత.. నేడు విజేత! నిన్నటిదాకా గుబిడే నాగుబాయి వేసే వేడివేడి బజ్జీలు తినడానికి ఇష్టపడ్డ జనం.. రేపట్నుంచి సమస్యలు పరిష్కరించమని కోరనున్నారు.
  • కువైట్‌ ఫ్లైట్‌ దిగగానే.. ‘గోల్డెన్‌’ ఛాన్స్‌! స్థానిక నాయకులు సుదీర్ఘంగా వ్యూహాలతో.. భారీ ప్రచారాలతో చెమటోడ్చితే.. సయ్యద్‌ మహబూబ్‌అలీ మాత్రం కువైట్‌ నుంచి వచ్చీరాగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు.
  • టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన జూ.అసిస్టెంట్ల నియామకానికి చర్యలు టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 1,309 మంది జూనియర్‌ అసిస్టెంట్లతో ఖాళీలను భర్తీ చేయనున్నందున ఆ పోస్టుల్లో ఒప్పంద, పొరుగుసేవల ద్వారా పనిచేస్తున్న వారిని తొలగించనున్నారు.
  • ‘స్వతంత్రం’గానే హ్యాట్రిక్‌! నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో స్వతంత్ర అభ్యర్థి తాళ్ల శ్రీధర్‌గౌడ్‌ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌ సాధించారు.