Crime News: అదుపుతప్పి రెండు కార్లను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఏడుగురి మృతి

Eenadu icon
By Crime News Team Updated : 24 Dec 2025 22:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తిరుచిరాపల్లి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. టైర్ పేలడంతో ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు వ్యతిరేక దిశలోకి వెళ్లి రెండు వాహనాలను ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

యూపీలో రైలు ఢీకొని ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ట్రాక్‌ను దాటుతుండగా ద్విచక్రవాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. షాజహాన్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 

 

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 21:44 IST