Chatbots: బ్రేకప్ అయిందా.. చాట్‌బాట్‌ ఉందిగా: మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By Business News Team Updated : 24 Dec 2025 15:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌బాట్స్‌ రాకతో కృత్రిమమేధను ప్రజలు వాడుకునే తీరే మారిపోయింది. చాట్‌జీపీటీ-5, గ్రాక్, పర్‌ప్లెక్సిటీ ఏఐ, మెటా ఏఐ వంటి ఎల్‌ఎల్‌ఎమ్స్‌ అసాధారణ సేవలందిస్తున్నాయి. కొందరి జీవితాల్లో ఇప్పటికే విడదీయలేని భాగంగానూ మారాయి. వీటి గురించి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ‘బ్రేక్‌డౌన్‌’ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Microsoft AI CEO). తమ భావోద్వేగాలను పంచుకోవడానికి, బాధను వ్యక్తంచేసుకోవడానికి పలువురు ఏఐ చాట్‌బాట్స్‌ను వాడుతున్నట్లు చెప్పారు.

‘‘బ్రేకప్‌, కుటుంబంలో సమస్యలు వంటి సందర్భాల్లో భావోద్వేగ మద్దతు కోసం చాలామంది ఈ ఏఐ సహచరుల మీద ఆధారపడుతున్నారు. అయితే ఇదేమీ చికిత్స కాదు. ఇవి ఎలాంటి పరిష్కారాలు సూచించవు. కానీ సానుభూతి, గౌరవంతో వ్యవహరిస్తాయి. ఆ దిశగా అవి శిక్షణ పొందుతాయి. ఇక్కడ మన బాధను తగ్గించుకోవడం ద్వారా మన ప్రయాణాన్ని మెరుగ్గా కొనసాగించగలం’’ అని ముస్తఫా (Mustafa Suleyman) పేర్కొన్నారు.

  • మనం చూస్తున్న అతి పెద్ద మార్పు ఏఐ

అయితే చాట్‌బాట్స్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే (AI chatbots). కొందరు తమ రహస్యాలను, గతంలో చేసిన తప్పులనూ చాట్‌బాట్‌తో చర్చిస్తుంటారు. పూర్తి పేరు, ఇంటి చిరునామా, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చాట్‌బాట్‌తో పంచుకుంటే ఏమీ కాదని చాలామంది అనుకుంటుంటారు. ఇది నిజం కాదని, ఇలాంటి సున్నితమైన సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. గోప్యతను కాపాడటానికి ఏఐ ఎలాంటి హామీ ఇవ్వబోదని, కాబట్టి వ్యక్తిగత వివరాలను కాపాడుకోవటం తప్పనిసరని చెప్తున్నారు. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 15:35 IST