నూతన సంవత్సర శుభాకాంక్షలు.. విద్యార్థుల వినూత్న ఆలోచన!

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 24 Dec 2025 19:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

తెనాలి టౌన్: నూతన సంవత్సర శుభాకాంక్షలను విభిన్నంగా ఆవిష్కరించాని తెనాలి పాఠశాల విద్యార్థులు ఆలోచన చేశారు. మారీసుపేటలోని నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు వెంకట్‌ నేటి తరానికి తెలియని పోస్టు కార్డును పరిచయం చేశారు. కార్డులపై చిత్రించిన బొమ్మలను గ్రీటింగ్‌ కార్డులుగా మల్చుకుని వాటి ద్వారా తమ బంధుమిత్రులు, నేతలు, అధికారులు ఇలా తమకు తోచిన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంపుతారని వెంకట్ వివరించారు. పలువురు విద్యార్థులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, పలువురు స్థానిక అధికారులకు పంపేలా చిరునామాలతో కార్డులను సిద్ధం చేసుకున్నారు. 100 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 కార్డుల చొప్పున 1000 బొమ్మల కార్డులను ఆవిష్కరించారు. 

► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వైభవంగా నాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవం [ 18-02-2026] కోరిన కోర్కెలు తీర్చే అమ్మ పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
  • డీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట సహకార సంఘాల సిబ్బంది ధర్నా [ 18-02-2026] పట్టణంలో స్థానిక కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల సహకార సంఘాల సిబ్బంది ధర్నా నిర్వహించారు.
  • గ్రంథాలయాల అభివృద్ధికి కృషి [ 18-02-2026] జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ  ఛైర్ పర్సన్ భీమనేని వందనా దేవి అన్నారు.
  • గుడివాడ సీసీఎస్‌ పీఎస్‌ గోదాములో అగ్నిప్రమాదం [ 18-02-2026] కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
  • తవ్వుకో రేవంతా.. తోలుకో రోజంతా.. [ 18-02-2026] ఇసుకాసురుల ధన దాహానికి కృష్ణా నది గుల్లబారిపోతోంది. ఉచిత ఇసుక మాటున భారీ దందా సాగిస్తున్నారు. నేతలు.. అధికారులు ఏకమై ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. కళ్లముందే నిబంధనలకు పాతరేసినా అధికారులకు పట్టదు. నేతల అండతో రేవుల్లో అక్రమాలకు అంతేలేదు. 
  • నీరిస్తారా? నీరుగారుస్తారా? [ 18-02-2026] గుంటూరు నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్న వ్యవస్థల్లో లోపాలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సైతం సమస్యలను మరింతగా జటిలం చేస్తున్నాయి.
  • మెప్మాలో రుణ బాగోతాలపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం [ 18-02-2026] గత వైకాపా పాలనలో మెప్మా విభాగంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా స్పందించి విచారణకు ఆదేశించారు.
  • ఎయిమ్స్‌ ప్రస్థానం అద్వితీయం [ 18-02-2026] మంగళగిరి ఎయిమ్స్‌ ప్రస్థానం అద్వితీయం. బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు స్తంభాలపై నిలిచి ఉంది. నమ్మకం అనే నాలుగో స్తంభాన్ని కూడా చేర్చాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆకాంక్షించారు.
  • రాజధానిలో భూసేకరణకు సిద్ధం [ 18-02-2026] నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొంతమంది రైతులు వివిధ కారణాలతో ఇప్పటికీ భూసమీకరణలో భూములివ్వలేదు.
  • చిట్టి తల్లులు.. చేదు నిజాలు.. [ 18-02-2026] చిట్టితల్లులు చిక్కుల్లో పడుతున్నారు.. కౌమార దశలోనే పెద్ద బాధ్యతను కడుపులో మోస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లిప్తత.. కారణాలేమైనా టీనేజ్‌ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు పడుతున్నారు.
  • సరఫరాలో జాప్యం.. స్పందిస్తే నయం [ 18-02-2026] ఉమ్మడి జిల్లాలో మిల్లర్లను ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ కొరత వేధిస్తోంది. కొన్నాళ్లుగా వీటి సరఫరా సరిగాలేక ఇబ్బందులు తప్పడంలేదు. అవి కలిపాకే బియ్యాన్ని మిల్లర్లు సరఫరా చేయాల్సి రావడంతో ఉమ్మడి జిల్లాలో భారీగా నిల్వలు మిల్లుల్లోనే నిలిచిపోయాయి.
  • మునేరు కరకట్టకు మోక్షం..! [ 18-02-2026] 2024 వరదలు మునేరు వెన్ను విరిచాయి. కరకట్టకు 23చోట్ల గండ్లు పడ్డాయి. అనేకచోట్ల గట్లు బలహీనపడ్డాయి. భవిష్యత్తు దృష్ట్యా.. ముందు జాగ్రత్తగా కూటమి సర్కారు నడుం కట్టింది. గండ్లు పూడ్చే పనులకు రంగం సిద్ధం చేసింది.
  • సిమ్‌లు మారుస్తూ.. సీన్‌ ఏమారుస్తూ! [ 18-02-2026] సంచలనం రేపిన పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంక తప్పించుకు తిరుగుతోంది. గత నెలలో మేరఠ్‌లో త్రుటిలో తప్పించుకున్న నిందితురాలు ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తోంది. బెజవాడ పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో..
  • చేసేది మ్యూల్‌ వ్యవహారాలు.. చెప్పేది సాఫ్ట్‌వేర్‌ కొలువు [ 18-02-2026] తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని అనీ, జీతం నెలకు రూ.30 వేలనీ.. ఇంట్లో అందరినీ నమ్మించాడు. కానీ చేసేది చట్టవిరుద్ధ కార్యకలాపాలే. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన మ్యూల్‌ ఖాతాల కేసులో కీలక సూత్రధారి రాజా వెంకట్‌ వ్యవహారమిది.