Revanth Reddy: కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం: సీఎం రేవంత్‌

Eenadu icon
By Telangana News Team Updated : 24 Dec 2025 20:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కోస్గి: తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) శపథం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చి తోలు తీస్తానంటున్నారు. కేసీఆర్‌వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మెదలుపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టా. నేను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారు.. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్‌ను కేసీఆర్‌ బందీఖానాగా మార్చుకుని చుట్టూ పోలీసులున్నారు. చర్లపల్లికైనా, చంచల్‌గూడ జైలుకు పంపినా అదే పరిస్థితి ఉంటుంది కదా. నన్ను గెలకవద్దు.. మర్యాదగా ఉండదని మాట్లాడటం లేదు. నల్లమల నుంచి వచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత సీఎం అయ్యా.

కేటీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసు?

స్థిరాస్తి వ్యాపారం దందా చేస్తున్నానని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఇదేం పాస్‌పోర్టు బ్రోకర్‌ వ్యవహారం కాదు. దుబాయ్‌ పంపుతామని ఎవరినీ మోసం చేయలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మరో వైపు.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని కేటీఆర్‌ చెబుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వారు పోతారని వదిలేశాం. మైకు ముందుకు రావట్లేదు.. దాక్కున్నానని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత? తండ్రి పేరు చెప్పుకొని బతుకుతున్నావు. ఏపీలో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసు? మా ఊరికొస్తావా? మీ ఊరికి రావాలా? ఎవరు భయపడుతున్నారో తెలుస్తుంది. గజ్వేల్‌లో లక్షలాది మంది కార్యకర్తలతో నిరసన చేపడితో పాతాళానికి వెళ్లారు.

బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ గతమే..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు అయితే.. 2/3 వంతు మెజార్టీతో 80కి పైగా సీట్లతో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఒకవేళ 153 సీట్లయితే.. 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో సారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు రాసి పెట్టుకోండి.. ఇదే నా సవాల్‌. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. కొడంగల్‌ బిడ్డగా ఈ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబానికి అధికారమనేది కల. భారత రాష్ట్ర సమితి, కేసీఆర్‌ చరిత్ర ఖతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ గతమే.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌. గత చరిత్రతో ఒరిగేదేమీ లేదు.

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. ఏ అంశంపైనైనా చర్చిద్దాం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం. పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చాం. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టాం. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. 12,726  పంచాయతీల్లో 8,335 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా? 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి.  ఇప్పటికైనా కేసీఆర్‌ వయసును గౌరవిస్తాం. ఈనెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మీరు చెప్పిన అన్ని అంశాలపై చర్చిద్దాం రండి. అసెంబ్లీలో చర్చించకుండా ఫాంహౌస్‌లో నిద్రపోయి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు వింటారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 17:51 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.