కూసుమంచిలో విషాదం.. విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్

- A
- A+
- A++

కూసుమంచి: పాఠశాలలో రాసుకునేందుకు తీసుకొచ్చిన పెన్సిల్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం జరిగింది. విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా.. అదుపు తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో చిన్నారి చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 18:09 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- లస్కర్ పోస్టుల్లో ఆదివాసీలనే భర్తీ చేయాలి [ 18-02-2026] తాలిపేరు ప్రాజెక్టు కాలువలపై స్థానిక ఆదివాసీలతోనే లస్కర్ పోస్టులను భర్తీ చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు.
- ఖమ్మంలో కమిషనర్ పర్యటన [ 18-02-2026] నగర పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పుర కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు.
- జీవితంలో ఇంటర్ విద్యే కీలకం: ఎమ్మెల్యే వెంకట్రావు [ 18-02-2026] జీవితంలో అనుకున్న ఉన్నత లక్ష్యాలు అధిరోహించాలంటే.. అందుకు ఇంటర్ విద్యే కీలకమని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.
- ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు [ 18-02-2026] సత్తుపల్లి మండలం రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
- తపాలా సేవల్లో జక్కేపల్లి బ్రాంచి.. జిల్లాలో ఆదర్శం [ 18-02-2026] తపాలా సేవల్లో కూసుమంచి మండలంలోని జక్కేపల్లి బ్రాంచి జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోందని పోస్టల్ జిల్లా సూపరింటెండెంట్ వీరభద్రస్వామి చెప్పారు.
- గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత [ 18-02-2026] ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ గోవధ శాలలకు తరలిస్తున్న గోవులతో వెళ్తున్న కంటైనర్‌ను భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపి పట్టుకున్నారు.
- ‘వ్యర్థం’ చేస్తున్నారు! [ 18-02-2026] ఖమ్మం నగరంలో 2021లో పూర్తయిన మానవ ఘనవ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారం మూడేళ్లు బాగానే నడిచింది. 2024 సెప్టెంబర్‌లో వచ్చిన మున్నేరు వరద నీటిలో చిక్కి మూలనపడింది. ఏళ్లు గడుస్తున్నా ఇది పునరుద్ధరణకు నోచుకోకపోవటంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
- పంటల సర్వే పట్టాలెక్కేనా? [ 18-02-2026] వ్యవసాయ రంగంలో పారదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ‘డిజిటల్ పంట సర్వే’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతున్న పంటల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
- టన్నులకొద్దీ నిర్లక్ష్యం! [ 18-02-2026] ఈ ఏడాది జనవరి 5న కేఓసీ నుంచి మహారాష్ట్ర వనికి బొగ్గు లోడ్‌తో ఓ లారీ వెళ్లింది. కేఓసీ వేబ్రిడ్జి వద్ద 43.25 టన్నుల బొగ్గును లోడ్ చేశారు. అన్‌లోడ్ పాయింట్ వద్ద 44.72 టన్నుల తూకం వచ్చింది. అంటే 1.47 టన్నులు ఎక్కువ అన్నమాట.
- ఉద్యోగులు తప్పుచేస్తే కఠిన చర్యలు [ 18-02-2026] ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకంగా సేవలందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) ధరంపురి జగదీశ్ తెలిపారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయంపై అనిశా దాడుల నేపథ్యంలో భవిష్యత్తులో ఆరోపణలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
- ప్రతి విద్యార్థి చదివేలా బోధన ఉండాలి: శ్రీజ [ 18-02-2026] ప్రతి విద్యార్థి చదివేలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బోధన ప్రక్రియలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. ఏడు మండలాల ఎంఈఓలు, పీఎస్ ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
- ఏఐ సమిట్‌లో నగర యువకుడు [ 18-02-2026] దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026’ సమిట్‌లో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన యువకుడు సత్యజిత్‌చారికి దక్కింది. ఖమ్మంలోనే పాఠశాల, కళాశాల చదువు పూర్తి చేసుకున్న సత్యజిత్ ఐఐటీ,
- పదవులు కాదు.. చేసిన పనులే శాశ్వతం: తుమ్మల [ 18-02-2026] ‘రాజకీయ జీవితంలో పదవులు శాశ్వతం కావు.. చేసిన అభివృద్ధి శాశ్వతమ’ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గండుగులపల్లిలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెహానాబేగం, వైస్ ఛైర్‌పర్సన్ బొంతు సుమలత,
- రూ.2 కోట్ల బీమా చేయించి హత్యాయత్నం [ 18-02-2026] తల్లిదండ్రులు లేని యువకుడి పేరిట బీమా చేయించి సొమ్ముల కోసం అతణ్ని అంతమొందించాలని పథకం రూపొందించారు. తీవ్రంగా కొట్టి రహదారి ప్రమాదంగా చిత్రీకరించాలనుకొన్నారు. విచారణలో ఇది ప్రమాదం కాదని ప్రణాళిక ప్రకారం చేసిన ఘాతుకమని పోలీసులు నిర్ధారించారు.
- కొలువు వచ్చి మూడు నెలలు.. అంతలోనే అకాల మరణం [ 18-02-2026] ఓ యువకుడు గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. కారేపల్లి మండల కేంద్రానికి చెందిన దేవాదాయశాఖ ఉద్యోగి గణితి నారాయణ కుమారుడు సాయిచంద్ర(24) బీఫార్మసీ పూర్తి చేసి,