Actor Shivaji comments: ఆడబిడ్డలకు క్షమాపణలు.. ఆ రెండు పదాలు వాడటం తప్పే: శివాజీ

Eenadu icon
By Entertainment Team Updated : 24 Dec 2025 16:35 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

హైదరాబాద్‌: హీరోయిన్‌ దుస్తులను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని నటుడు శివాజీ స్పష్టం చేశారు. అయితే, ఆ సందర్భంలో రెండు అసభ్య పదాలను వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘దండోరా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈవెంట్ నుంచి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించినట్లు తెలిపారు.

నేను నిద్రపోయి 36 గంటలైంది..

‘‘ఆ రోజు వేదికపై ఉన్న నా తోటి నటీనటులు, ఆడ బిడ్డలకు క్షమాపణలు. అలాంటి పదాలు దొర్లకూడదు. 30 ఏళ్ల సినీ జీవితంలో అలా మాట్లాడలేదు. రాజకీయాల్లోనూ ఏ రోజూ ఎవరినీ ఒక చిన్న మాట అనలేదు. హద్దు మీరి మాట్లాడలేదు. ఈవెంట్‌లో ఎందుకు అలా మాట్లాడానా? అని బాధపడ్డాను. బయటకు రాగానే, పొరపాటుగా మాట్లాడినట్లు గ్రహించా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. అయితే, నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నా. ఎవరికీ భయపడే పనే లేదు. ఆ రెండు పదాలు మాత్రం మాట్లాడటం తప్పు. నేను నిద్రపోయి 36 గంటలైంది. నాలో అంతర్మథనం మొదలైంది. రాజకీయాల్లోనూ తప్పు మాట్లాడని నేను ఇలా ఎలా మాట్లాడానా? అని ఆలోచిస్తూ ఉండిపోయా. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాని నుంచి బయటకు వచ్చి నేనే ప్రెస్‌మీట్‌ పెడతానని నిర్మాతకు చెప్పాను. ఆయన ‘ఎందుకులేండీ.. వివాదమవుతుందేమో’ అని ఆయన అన్నారు. కానీ, సినిమాకు డబ్బులు తీసుకున్నందుకు నా వంతు ప్రమోషన్‌ చేయాలి కదా! ప్రేక్షకులు అందరూ కచ్చితంగా థియేటర్‌లో సినిమా చూడండి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను గాఢంగా స్పృశించింది ఈ కథ. మనుషులు ఉన్నంత వరకూ ఈ అసమానతలు ఉంటాయి. అలాంటి మంచి కథతో ‘దండోరా’ను తీర్చిదిద్దారు’’

ఎవరు ఏ డ్రెస్‌ వేసుకోవాలో చెప్పటానికి నేనెవర్ని..

‘‘తెలుగు జాతి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటిగారి సహా ఎంతో మంది తమ మాటల్లో స్త్రీ ప్రాముఖ్యత గురించి చెప్పారు. ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో ఎలా చేసినా, బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేను అలా మాట్లాడానికి ప్రధాన కారణం లులూ మాల్‌లో నిధి అగర్వాల్‌ పడిన వేదన. కారులో కూర్చొన్న తర్వాత ఆమె పడిన ఇబ్బంది నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ తర్వాత సమంతగారిని కూడా అలాగే వేధించారు. ఒకప్పుడు రమ్యకృష్ణ గారు, జయసుధ గారు, విజయశాంతి గారు కట్టుకున్న చీరలు వాళ్ల పేరుతోనే విక్రయాలు జరిగేవి. ఫలానా డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలని నేను ఎవరికీ చెప్పలేదు. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా, సినిమాల వల్లే చెడిపోతున్నారని అంటారు. సినిమా వల్లే ఈ ప్రపంచం నాశనమవుతోందనే మాటలు వింటూ ఉన్నాం. సినిమా ద్వారానే నా కుటుంబం బతుకుతోంది. నా సినిమాను ఎవరూ అనకూడదనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వచ్చింది’’

అడిగితే బాగుండేది.. ఆవేశంగా ఫిర్యాదులు చేశారు..

‘‘నేను తప్పుగా మాట్లాడానని అనిపించిన తర్వాత మొదటగా నా భార్యకు క్షమాపణ చెప్పాను. వెంటనే ఓ వీడియో రికార్డు చేసి, చిత్ర టీమ్‌కు పంపాను. కానీ, అనవసరంగా దీన్ని పెద్దది చేయడం ఎందుకని వద్దని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత కొన్ని ట్వీట్లు చూశాను. గాయని చిన్మయి, అనసూయగారికి కొందరు ట్యాగ్‌ చేయడం మొదలు పెట్టారు. నావైపు తప్పు దొర్లింది కాబట్టి, వారు ఏమన్నా సర్దుకుపోవాల్సిందే. ఇంకా క్షమాపణ చెప్పాల్సి వస్తే, చెబుతాను. నా భార్య, పిల్లలు నా వల్ల ఇబ్బంది పడకూడదు. ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఆవేశంగా కొందరు ‘మా’కు లేఖ రాశారు. ‘శివాజీతో మాట్లాడి, క్షమాపణ చెప్పిద్దాం’ అని ఎవరూ అనలేదు. ఎవరికి వారు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, సహా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘ఏంటి అన్నా.. ఇలా మాట్లాడారు’ అని ఒక్కరు కూడా అడగలేదు. అలా అడిగితే, నేను చెప్పేవాడిని కదా. ఒక్క సుప్రియ గారే ఫోన్‌ చేశారు. ఆమెకు కూడా క్షమాపణ చెప్పా’’

ఒక్కరైనా నిధి అగర్వాల్‌కు అండగా నిలబడ్డారా?

‘‘లులూ మాల్‌ ఘటనలో నిధి అగర్వాల్‌ దుస్తులు పొరపాటున జారిపోయి ఉంటే, జీవితాంతం ఆ వీడియోలు ఉండిపోయేవి. ఆ సంఘటన వల్లే అలా మాట్లాడా. చిత్ర పరిశ్రమలో నా కంటే పెద్ద పదాలు ఎవరూ వాడలేదా? అమరావతి మహిళలపై బూటు కాలు వేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా. జెన్‌-జీ కోసం మాట్లాడా. మనం మనుషులం.  పొరపాట్లు జరుగుతాయి. అలాగని, నేను సమర్థించుకోవడం లేదు. నేను మాట్లాడిన రెండు మాటలు చిన్మయి గారి దగ్గర నుంచి ఉమెన్ కమిషన్ దాకా వెళ్లిపోయిందనే నా ఆవేదన.  ఈనెల 27న మా దగ్గరకు రావాలని అన్నారు.  నేను వెళ్తాను, వెళ్లి ఒక క్షమాపణ లేఖ ఇస్తా. అందుకు నేనేమీ సిగ్గుపడను. తెలుగు సినిమాల్లో కూడా సెన్సార్ గడప దాటి వస్తున్నాయి. అప్పుడు అలాంటి వాటిపై ఎలాంటి స్పందన ఎందుకు కనిపించలేదు? ‘ఆడ పిల్లలపై ఇలా దాడి చేయటం సరికాదు’ అని ఒక్కరైనా నిధి అగర్వాల్‌కు అండగా నిలబడ్డారా? మనకు బాధ్యతలు కూడా ఉంటాయి కదా! అనసూయగారు ఇందులోకి ఎందుకు వచ్చారు? ఆమెను నేను ఒక్క మాట కూడా అనలేదు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను తప్పకుండా స్పందిస్తా. నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్న వాళ్లకు క్షమాపణలు’’ అని శివాజీ వివరణ ఇచ్చారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 15:15 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.