Dhurandhar: అలా ఏడ్చిన వారంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారు: ధురంధర్ దర్శకుడి పోస్ట్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది ‘ధురంధర్’. ఎంతోమంది ప్రశంసలు అందుకుంటోన్న ఈ సినిమాపై మొదటి వారంలో కొందరు విమర్శలు చేశారు. తాజాగా దర్శకుడు ఆదిత్యధర్ వాటిపై స్పందించారు. ఈ సినిమాకు వస్తున్నవన్నీ కార్పొరేట్ బుకింగ్స్ మాత్రమేనంటూ కొందరు పెట్టిన పోస్ట్‌లపై ఆదిత్య (Aditya Dhar) తన ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు సమాధానమిచ్చారు.
విడుదలైన మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్న ‘ధురంధర్’ (Dhurandhar) ఇప్పటికీ ఆ జోరు కొనసాగుతోంది. బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసిన దర్శకుడు విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ధురంధర్ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే.. ఈ సినిమాకు వచ్చిన ప్రతి టికెట్ ఆర్గానిక్‌గా కొన్నదే. విడుదలైన సమయంలో కార్పొరేట్ బుకింగ్స్ (బాక్సాఫీసు నంబర్ల కోసం ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున టికెట్ల బుకింగ్స్ చేయడం) అని ఏడ్చిన వారంతా ఇప్పుడు అకస్మాత్తుగా మౌనం వహిస్తున్నారు. భారతీయ సినీ రంగంలో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంపై ఉన్న ప్రేమకు ‘ధురంధర్’ నిదర్శనం’’ అని పేర్కొన్నారు.
- ‘హోమ్‌బౌండ్’పై కాపీ ఆరోపణలు.. చట్టపరంగా సమాధానమిస్తామన్న టీమ్
మరోవైపు ‘ధురంధర్2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు, హిందీతో పాటు, దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పార్ట్2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలిపారు. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మూడో వారం కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది (Dhurandhar Collections). ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూళ్లు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ వారంలోనే రూ.1000కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 14:48 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 24 ఏళ్లుగా నరకం.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా కానీ..: ప్రత్యూష తల్లి తన కుమార్తె, నటి ప్రత్యూష (Prathyusha) మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీదేవి (Prathyusha Mother) స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు.
- మరో చీకటి కోణం.. ‘ది కేరళ స్టోరీ2’ ట్రైలర్ చూశారా? న్నో వివాదాలు, విమర్శల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సొంతం చేసుకుంది ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది.
- అకౌంట్‌లో రూ.లక్ష చూస్తే చాలనుకున్నా..: విశ్వక్ సేన్ ఒకప్పుడు తన అకౌంట్‌లో రూ.50వేలు చూడటం కల అని విశ్వక్ సేన్ అన్నారు. ‘హిట్’ సినిమాకు అడ్వాన్స్ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు.
- అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్ పీక్‌లో ‘సూసైడ్’: నటి ప్రత్యూష కథ ఇది..! Actress Prathyusha: గ్లామర్ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలెన్నో..! స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి.
- మేకప్ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్ (NTR), ఏయన్నార్ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి
- చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. అక్కడ షూటింగ్‌పై బ్యాన్! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ధురంధర్ 2’ చిక్కుల్లో పడింది.
- నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
- విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
- ఆ పాటలు వాడొద్దు.. ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
- నేనూ వాళ్ల బాటలోనే...! సుహాస్ - శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్’ చిత్రం పేరు మార్చుకుంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈ టైటిల్‌ని ‘హే బల్‌వంత్’గా మార్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
- అట్లూరి జీవితం నేటి తరానికో పాఠం కష్టేఫలి అనే సూత్రానికి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
- ఏఐ.. నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది చిత్రపరిశ్రమలో తదుపరి పెద్ద విభజన.. ఏఐ(కృత్రిమ మేధ)ని స్వీకరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తిని నిర్మించేవారికి, వాటిని ఉపయోగించేవారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు.
- సూపర్ డీలక్స్ తర్వాత పాకెట్ నావెల్ నలుగురు వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలతో రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజా కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రమిది.
- కథ ఇంకా పూర్తి కాలేదు ‘దల్దాల్’ సిరీస్‌లో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించి నిందితుల్ని పరుగులు పెట్టించింది బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్. అమ్రిత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సురేశ్ త్రివేణి సృష్టికర్త.
- ‘జై హనుమాన్’ సన్నాహాలు ‘హను-మాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
- సంక్షిప్త వార్తలు (4) బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్.. త్వరలో ముంబయికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లతో తెరపైకి రావడానికి సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన..
- ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇదే.. వీడియో వైరల్ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్ స్పందించారు.