sivaji comments: పొరపాటు జరిగింది.. సారీ చెప్పిన నటుడు శివాజీ..

Eenadu icon
By Entertainment Team Updated : 23 Dec 2025 19:16 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: తన వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ (Actor Sivaji) క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలు దొర్లాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్స్‌ వేదిక వీడియో విడుదల చేశారు.

‘‘ఇటీవల పలువురు హీరోయిన్స్‌ ఇబ్బంది పడిన సందర్భాన్ని ఉద్దేశిస్తూ ‘దండోరా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడాను. నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అసభ్య పదాలను ఉపయోగించా. వాటి వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బ తింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. ‘బయటకు వెళ్లినప్పుడు మంచి దుస్తులు వేసుకుని ఉంటే మీకు ఈ ఇబ్బంది ఉండేది కాదేమోనమ్మా’ అనే ఉద్దేశం తప్ప, ఎవరినీ అవమాన పరచాలని కాదు. ఏదైనా రెండు అసభ్య పదాలు దొర్లాయి. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. స్త్రీ అంటే శక్తి. నేను అమ్మవారిగా భావిస్తా. ప్రస్తుత సమాజంలో మహిళను తక్కువగా చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వవద్దని చెప్పే ఉద్దేశంతో ఊరి భాష మాట్లాడా. ఆ పదాలు దొర్లకుండా ఉంటే బాగుండేది. ఒకటి మాత్రం చెబుతున్నా, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప, ఇందులో ఎవరినీ అవమానపరచాలని, కించపరచాలని ఉద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే మీ అందరికీ మరోసారి క్షమాపణలు’’ - ఎక్స్‌వేదికగా నటుడు శివాజీ

నటుడు శివాజీ వ్యాఖ్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నందినిరెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్, లక్ష్మి మంచు, ఝాన్సీలు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ పేరుతో మా అధ్యక్షుడికి లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్‌ కూడా శివాజీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని మహిళా కమిషన్‌ ఆదేశించింది. 

ఇంతకీ శివాజీ ఏమన్నారంటే..

‘దండోరా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ మాట్లాడుతూ.. ‘‘నటీమణులు కొంచెం డ్రెస్‌ సెన్స్ పాటించాలి. మీ అందం మొత్తం నిండుగా వేసుకొనే దుస్తుల్లోనే ఉంటుంది. ఫ్యాషన్‌ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నాయనే అంటారు. కానీ, లోపల తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది (Sivaji Comments on Dress Sense). నటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంతో గుండెల్లో కనబడుతూ ఉంటారు. గ్లామర్‌కు ఒక హద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టులో వచ్చినవారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 18:28 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.