Pawan Kalyan: భయం వద్దు.. మళ్లీ ఆ పాలన రాదు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 23 Dec 2025 04:17 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

పార్టీ వాళ్ల పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. అదొక రౌడీల సమూహం అనిపిస్తుంటుంది నాకు. వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకూ సిద్ధమే. రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం. కాదు, కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం. 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదని, మళ్లీ వాళ్లు (వైకాపా) అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానీయబోనని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. పాత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరి బెదిరింపులకూ భయపడకుండా శాంతిభద్రతలను కాపాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంచి పోలీసు అధికారులకు ప్రజలు అండగా నిలవాలన్నారు. జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వ పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా ఉండాలని వివరించారు. ఎలాంటి తప్పుడు సెటిల్‌మెంట్లు చేసినా ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ తమ పదవి ద్వారా ప్రజలకు అంతో ఇంతో మంచి చేయాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ‘పదవి-బాధ్యత’ అనే కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వం ద్వారా పదవులు పొందిన నాయకులందరితో పవన్‌ కల్యాణ్‌ సమావేశమై మాట్లాడారు. ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

అప్పటి వరకు కూటమి బలమే కోరుకుంటా.. 

‘నేను 10, 15 ఏళ్లు కూటమి పాలన ఉండాలని తరచూ చెప్పేది మనం, మన పార్టీ తగ్గాలని, ఎవరినో బలోపేతం చేయాలని కాదు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే అరాచకమే రాజ్యం ఏలుతుంది. అలాంటి పరిస్థితి అంటే నాకు భయం. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత అందరూ ఒకస్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన చేద్దాం. అప్పటి వరకు కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చి చంపేస్తామని, పోలీసు అధికారులకు తామంటే ఏమిటో చూపిస్తామని అనడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటివి చేస్తున్నారంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పెట్టుబడులకు, పర్యాటకానికి కూడా ఇబ్బందే. ఎవరూ భయపడకండి, మళ్లీ ఆ పాలన రాదు’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

పనితీరు గుర్తించే 3,459 పదవులు ఇచ్చాం 

‘కూటమి ప్రభుత్వంలో 3,459 మంది జనసేన నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. మరికొందరిని త్వరలో నామినేట్‌ చేస్తాం. మొదటి నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసినవారికీ, పార్టీ కోసం కష్టపడినవారికి ఎలాంటి సిఫార్సులు లేకుండా పదవులు ఇచ్చాం. ఓడిపోయినా పార్టీ కోసం నిలబడ్డవారిని గుర్తించాం. ఎమ్మెల్యేలు 21 మంది, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇన్ని కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాట పటిమ. ఏ పార్టీకైనా సమున్నత సిద్ధాంతం ఉండాలి. అందుకే 7 సిద్ధాంతాలను ఎంతో లోతుగా ఆలోచించి ప్రకటించాం. కులాల కోసం నేను పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ ఎదిగేకొద్దీ విస్తరించే పార్టీ. ఎందరినో కలుపుకొని వెళ్లే పార్టీ. జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీ మనది. పార్టీ కన్నా సగటు ప్రజలే నాకు ముఖ్యం. ప్రజలు ఏదీ చెప్పరు. వారి కోపాన్ని ఎన్నికల్లోనే చూపిస్తారు. మన నాయకులు ఎవరూ భూపంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేయొద్దు. అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. నేను అధికారాన్ని దుర్వినియోగం చేయను. మీరు చేస్తే చూస్తూ ఊరుకోను’ అని హెచ్చరించారు.   

పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి 

త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఉండాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారకుడైన పొట్టి శ్రీరాములు పేరు పోలవరం వంటి ప్రాజెక్టుకు పెట్టాలని భావిస్తున్నా. పిల్లల్లో కులాల భావన పెంచి పోషించకూడదు. ఎస్సీ, బీసీ స్కూళ్లు, ఎస్సీ, బీసీ సంక్షేమం అని ఎందుకు అనడం? అందరికీ ఒకే స్కూళ్లు ఉండాలి’ అని పవన్‌ కల్యాణ్‌ కోరారు. కొందరు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అని విమర్శలు చేస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్చలకు జనసేన నాయకులు వెళ్లొద్దని సూచించారు.

జెన్‌ జడ్‌ థీమ్‌తో ఆవిర్భావ దినోత్సవం.. 

‘వచ్చే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జన్‌ జడ్‌ థీమ్‌తో జరపాలని భావిస్తున్నాం. భవిష్యత్తు తరాలను ఉత్తేజపరిచేలా, పార్టీ విజన్, ఆశయాలు వారికి చేరేలా ఈ కార్యక్రమం ఉంటుంది’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ వైకాపా అయిపోయినట్లు కాదు.. 

‘పార్టీ నిర్మాణం అంత సులభం కాదు. జనసేనకు బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు లేవంటారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీగా మారిపోయినట్లుగా జనసేనకు కుదరదు. వాళ్ల తండ్రులు సీఎంలు కాబట్టి వాళ్లకు అన్నీ చెల్లుతాయి. పిఠాపురం నియోజకవర్గంలో 53 గ్రామాల్లో 51 గ్రామాలకు కమిటీలను పారదర్శకంగా నియమించాం. అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే చేయాలి. త్వరలో పార్టీ సభ్యత్వాల కార్యక్రమం చేపట్టబోతున్నాం. జనసేన కండువా వేసుకుంటే సభ్యత్వం ఉన్నట్లు కాదు. పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్లకే పదవులు వస్తాయి. కూటమిలో భవిష్యత్తులో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి. ముందుగానే సంసిద్ధం అవ్వండి. పార్టీ నాయకులు కూటమి నాయకులను కలుపుకుని వెళ్లేలా ఉండాలి’ అని పేర్కొన్నారు. 

‘మనం ఏ పదవిలో ఉన్నాం అనే దగ్గరే ఆగిపోకూడదు. మనకు అప్పగించిన పదవిని ఎంత బాధ్యతగా నిర్వహించామన్నది ముఖ్యం. 3,500 మంది సభ్యులను ఒకచోట సమావేశపరచి ఇచ్చిన బాధ్యతల పట్ల దిశానిర్దేశం చేయడం గొప్ప విషయం. పవన్‌ కల్యాణ్‌ వంటి నాయకుడికే అది సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో ఏ పనికైనా ‘నాకేంటి?’ అనే పద్ధతి ఉండేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. జనసేన పార్టీలో మాకేంటి కాదు.. నీకేం కావాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన దానికంటే.. పార్టీలో కార్యకర్తగా పనిచేయడం నాకు సంతృప్తి అనిపిస్తుంది. నాకు అప్పగించిన బాధ్యతకు కట్టుబడి శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి మాట్లాడటంలో తృప్తి ఉంది. భయం అనే మాట ఎరుగని పవన్‌ బాటలో నడవడం గౌరవంగా భావిస్తా’  

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 04:10 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 520 కేజీల కొమ్ముకోనం కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు శనివారం భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. 12 అడుగుల పొడవుతో ఏకంగా 520 కిలోలు ఉంది.
  • విశాఖ తీరంలో మరో సంబరం ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది.
  • కోటప్పకొండంత భక్తి! శివుడిపై భక్తితో ఓ కళాకారుడు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మినీయేచర్‌ను తయారు చేశారు.
  • తిరుమల ‘కమాండ్‌’ దేశానికే తలమానికం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు అత్యాధునిక సాంకేతికతలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం..
  • సవాళ్లున్నా సంక్షేమం.. అభివృద్ధే సంకల్పం ఒకటీ ఒకటీ కలిస్తే ప్రతిసారీ రెండే కానక్కర్లేదు.. ఒక్కోసారి అనూహ్యంగా ఎన్నో రెట్ల బలం సమకూరొచ్చు... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడంతోపాటు అటు కేంద్రంలోనూ కీలక భాగస్వామిగా మారడం అలాంటిదే.
  • సీమలో సిరుల పంట ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ముఖచిత్రమే మార్చేలా.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు.
  • మౌలికం.. పెట్టుబడుల ఆకర్షణకు మార్గం కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ‘పాలసీ 4.0’ విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులు పెంచడం.. రాష్ట్ర సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • అప్పులు తగ్గించుకుని.. ప్రగతి దిశగా అప్పులు తగ్గించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీరేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
  • విద్యకు రూ.34,875 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం బడ్జెట్‌లో విద్యకు రూ.34,875 కోట్లు (11శాతం) కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించింది.
  • ఊపందుకోనున్న అమరావతి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.6,000.10 కోట్లు ప్రతిపాదించింది. భూసమీకరణ పథకానికి రూ.50 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమిలేని పేదలకు పింఛన్ల కోసం రూ.115.14 కోట్లు కేటాయించింది.
  • కొత్త పథకాలు, కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పలు కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించింది. ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది.
  • రైతుకు రాజమార్గం రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూలస్తంభమైన వ్యవసాయరంగాన్ని పటిష్ఠపరిచేలా బడ్జెట్‌ కేటాయింపులు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
  • రోడ్లు, వంతెనలు రయ్‌..రయ్‌.. వైకాపా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించగా.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా ఆ రోడ్లను బాగుచేసేందుకే పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది.
  • ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌.
  • ఆర్థిక వృద్ధికి త్రిముఖ వ్యూహం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా తలపెట్టిన ఎకనమిక్‌ రీజియన్‌ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
  • రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మేమే రాయలసీమలో ఒకప్పుడు పశువులకు తాగడానికీ నీరు దొరికేది కాదని, రైళ్లలో పశుగ్రాసం, నీరు తరలించిన రోజులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హంద్రీనీవా ప్రాజెక్టు పనులను సీరియస్‌గా చేపట్టామని, అందుకే ఇప్పుడు దాని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
  • ఆది దేవుడి సన్నిధిలో.. ఆధ్యాత్మిక వైభోగం! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఆది దేవుడి ఉత్సవ శోభను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శివదీక్షా భక్తుల శివనామ స్మరణలతో శ్రీగిరులు మార్మోగిపోతున్నాయి.
  • ‘రాయంచ’పై.. సోమస్కందుడి వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కందమూర్తి శనివారం హంస వాహనంపై దర్శనమిచ్చారు.
  • శివోహం.. అనంతం! మహాశివరాత్రి నేపథ్యంలో బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట చూసేందుకు భక్తులకు వీలు కల్పించారు. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ సమీపంలోని ఓం శాంతి యోగా భవనంలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
  • సహస్ర వృత్తులకు సంక్షేమ పెన్నిధి గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో ఎస్టీలకు నిధుల కేటాయింపును ప్రభుత్వం పెంచింది. 2025-26లో రూ.8,159 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.9,190 కోట్లు చేసింది.