Vijay Hazare Trophy: స్టార్ ఆటగాళ్ల సందడి.. విజయ్ హజారే ట్రోఫీకి కొత్త కళ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఇంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) అంటే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టోర్నీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసిందో కూడా చాలామందికి తెలిసేది కాదు. కానీ, ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ షరతు విధించడంతో ఈ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీకి కొత్త కళ వచ్చింది. స్టార్ ఆటగాళ్లు తమ తమ రాష్ట్రాల జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. డిసెంబరు 24 నుంచి మొదలుకానున్న ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతోపాటు మరికొంత మంది స్టార్ ప్లేయర్లు సందడి చేయనున్నారు. కోహ్లీ 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండటం విశేషం.
మళ్లీ రో-కో ఫైర్ చూస్తామా?
ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ ( Rohit Sharma).. డిసెంబర్ 24, 26న సిక్కిం, ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌ల కోసం జైపుర్ చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు ఈ టోర్నీలో 18 మ్యాచ్‌లు ఆడి 600 రన్స్ చేశాడు. 2005-06 సీజన్‌లో వెస్ట్ జోన్‌కు ఆడిన హిట్‌మ్యాన్.. నార్త్ జోన్‌పై 142 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే దేశవాళీ క్రికెట్‌లో రోహిత్ వెలుగులోకి వచ్చాడు. ఇక, కొన్ని రోజుల కిందట లండన్ నుంచి భారత్‌కు చేరుకున్న కోహ్లీ ( Virat Kohli) ముంబయిలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. దిల్లీకి ఆడనున్న కోహ్లీ.. ఆంధ్రతో మ్యాచ్ కోసం బెంగళూరు వెళ్లాడు. విజయ్ హజారే (Vijay Hazare Trophy)లో ‘కింగ్’కు మంచి రికార్డు ఉంది. 2008-9 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు శతకాలు బాది 534 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాతి సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి 229 రన్స్ చేశాడు. ఇటీవల సఫారీలతో వన్డే సిరీస్‌లో రాణించిన రో-కో విజయ్ హజారే ట్రోఫీలోనూ అలరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
పంత్ సద్వినియోగం చేసుకుంటాడా?
కొంతకాలంగా టెస్టులకే పరిమితమైన రిషభ్ పంత్ దిల్లీకి ఆడనున్నాడు. ఈ టోర్నీలో సత్తాచాటి తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. మరి అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో నిరాశలో ఉన్న శుభ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో వన్డే సిరీస్ ఉన్నందున ఈ టోర్నీ అతనికి మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది.
కొత్త పేసర్లు వెలుగులోకి వస్తారా?
విజయ్ హజారే ట్రోఫీలో ప్రతిభావంతులైన యువ పేసర్లు వెలుగులోకి వస్తారని సెలక్టర్లు ఆశిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రంజీ ట్రోఫీలో రాణించిన మహ్మద్ సిరాజ్.. తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారాడు. సిరాజ్ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మరో కొత్త పేసర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి పేసర్లు వెలుగులోకి వచ్చినా వారిలో నిలకడ లేదు. గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యుధ్వీర్ సింగ్ (జమ్మూ కశ్మీర్), అనుజ్ థక్రాల్ (హరియాణా), సాకిబ్ హుస్సేన్ (బిహార్) ఈ టోర్నీలో రాణిస్తారనే అంచనాలున్నాయి.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.