ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ

- A
- A+
- A++

బాన్సువాడ పట్టణం: పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమానికి రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. పడిపూజ తమ నివాసంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్వామీజీ మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధారణ ఎంతో నిష్టతో, కఠిన నియమాలతో 41 రోజుల పాటు చేపట్టడం గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు.
► Read latest Nizamabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి [ 18-02-2026] విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈవో వెంకన్న, సర్పంచ్ అరిగే ధర్మతేజ పేర్కొన్నారు.
- పరీక్షలంటే భయపడొద్దు..! [ 18-02-2026] ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు భయపడొద్దని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి అన్నారు.
- మద్యం మత్తులో టవర్ ఎక్కి.. వ్యక్తి హల్‌చల్ [ 18-02-2026] సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.
- రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన 20 మందికి జరిమానాలు [ 18-02-2026] బీర్కూర్ మండలంలోని బైరాపూర్ శివారులోని ప్రధాన కూడలి వద్ద బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
- జగదాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం [ 18-02-2026] తిమ్మాపూర్‌లో దాతలు, గ్రామస్థుల విరాళాలు రూ.60 లక్షలతో నిర్మించిన శ్రీ జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం ప్రారంభమైంది.
- యూరియా కోసం రైతుల ఆందోళన [ 18-02-2026] యూరియా సకాలంలో అందడం లేదని ఎల్లారెడ్డి పట్టణంలోని గండిమాసానిపేట రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు.
- కారు అద్దాలు పగులగొట్టి రూ.8 లక్షల చోరీ.. వీడియో చూడండి! [ 18-02-2026] బంధువుల చికిత్స, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.8 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి అపహరించారు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటుచేసుకుంది.
- వాహనాల రిజిస్ట్రేషన్ మరింత సరళం [ 18-02-2026] నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, జిల్లాలో శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాహన షోరూంల్లోనే నిర్వహిస్తున్నారు.
- షబ్బీర్‌అలీపై ఆరోపణలు చేస్తే సహించం [ 18-02-2026] ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
- ఇక.. నేరస్థులు తప్పించుకోలేరు.. [ 18-02-2026] నిజామాబాద్ బస్టాండ్‌లో పోలీసులు ఇటీవల తనిఖీలు చేపట్టగా, పరారీలో ఉన్న ఓ పాత నేరస్థుడు దొరికిపోయాడు. వెంటనే ఆయన్ను రిమాండుకు తరలించారు.
- ‘భరోసా’ ఏదని.. రైతుల ఎదురుచూపులు? [ 18-02-2026] పురపాలిక ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే అన్నదాతల ఖాతాల్లో యాసంగి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ప్రభుత్వం లోగడ వెల్లడించింది.
- జాతీయ రహదారిపై కారు దగ్ధం [ 18-02-2026] సదాశివనగర్ మండలం పద్మాజివాడి క్రాస్‌రోడ్డులో 44వ నంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
- అంచనా మించే భారానికి చెల్లు! [ 18-02-2026] విద్యుత్తు శాఖ కనెక్షన్ల జారీకి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇది వరకు అధికారులు అంచనా ప్రతిపాదనలు రూపొందిస్తే, దాని ప్రకారం వినియోగదారుడు రుసుం చెల్లించేవారు. ఈ విధానం సరిగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నియమావళిని సవరించింది.
- ‘రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి’ [ 18-02-2026] షబ్బీర్‌అలీకి రూ.కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారయత్నం [ 18-02-2026] మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఓ గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది.