Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/12/2025)

Eenadu icon
By National News Team Published : 24 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

మిశ్రమ కాలం కొనసాగుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. బలమైన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. తోటివారి సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభఫలితాలను ప్రసాదిస్తుంది.

వృషభం

ఉన్నత పదవీ లాభ సూచనలు ఉన్నాయి. నూతన వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు శుభకార్యసాధనకు దోహదపడతాయి. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తే మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదంగా ఉంటుంది.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు కొంతవరకు అధికం అవుతాయి. అయినా హుషారుగా పనిచేస్తే పురోగతి సాధ్యమే. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. సూర్యాష్టకం చదవడం వల్ల శుభఫలితాలు వస్తాయి.

సింహం

పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. శ్రీరామనామ జపం మంగళకరం.

కన్య

లక్ష్యసాధనలో అసాధారణ పట్టుదల ప్రదర్శించి అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తీసుకోవడం శ్రేయస్కరం. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

తుల

శుభకాలం. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకం చదవడం మేలు చేస్తుంది.

వృశ్చికం

గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరచవచ్చు. కలహ సూచన ఉన్నందున సంయమనం అవసరం. గోసేవ చేయడం వల్ల శుభఫలితాలు పొందుతారు.

ధనుస్సు

తోటివారి సహకారంతో ప్రారంభించిన పనులను చక్కబెడతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

మకరం

ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒత్తిడి కొంత పెరిగినా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.

కుంభం

ఇష్టకార్యసిద్ధి సూచన ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివారాధన మేలును చేకూరుస్తుంది.

మీనం

ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను మెప్పించేందుకు శ్రమ అధికం అవుతుంది. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉన్నందున జాగ్రత్త అవసరం. ఉత్సాహంగా ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రీరామ సందర్శనం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
  • కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్‌ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
  • గేట్స్‌ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్‌ గేట్స్‌ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
  • చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
  • బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్‌ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్‌ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
  • కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.