Tirumala: తిరుమలలో.. ప్రవాసీయులకు ప్రత్యేక దర్శనం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు, భారతీయులు మాతృభూమికి వచ్చినప్పుడు ఇల వైకుంఠపురమైన తిరుమలను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే తక్కువరోజుల సెలవులపై వచ్చే వారు సాధారణ క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉండటం కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఎన్నారైల కోసం ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పిస్తోంది.
‘సుపథం’.. సుగమం
- విదేశాల్లో నివాసం ఉన్నవారు తిరుమల దర్శనానికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు.
- నేరుగా తిరుమలలోని ‘సుపథం’ ద్వారా అనుమతిస్తారు. ఇది వైకుంఠం కాంప్లెక్స్-1 సమీపంలో ఉంటుంది.
- ప్రవేశ ద్వారం వద్ద కావాల్సిన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.300 ఉంటుంది.
- సాధారణంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు. రద్దీని బట్టి మార్పులుంటాయి.
- సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి.
- భారతదేశానికి చేరుకున్న తేదీ నుంచి 30 రోజులలోపు మాత్రమే ప్రత్యేక దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇవేకాక శ్రీవాణి, ఎస్‌ఎస్‌డీ, ఆన్‌లైన్.. ఇతర మార్గాల్లోనూ దర్శనం టికెట్లు పొందొచ్చు..
- రిజిస్ట్రేషన్ సమయంలో అంతర్జాతీయ లేదా భారతీయ మొబైల్ నంబర్‌ను ఇవ్వడం తప్పనిసరి.
పాస్‌పోర్టు స్టాంపింగ్ కీలకం
- దర్శనానికి వెళ్లే సమయంలో ఒరిజినల్ పాస్‌పోర్ట్ తీసుకెళ్లాలి.
- వీసా ఉన్నవారు తమ ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) లేదా పీఐఓ కార్డును చూపించాల్సి ఉంటుంది.
- ఎన్నారైలు భారత్‌కు వచ్చినట్లు నిర్ధారించేలా పాస్‌పోర్టుపై ఉన్న ‘ఇమ్మిగ్రేషన్ స్టాంప్ (అరైవల్ స్టాంప్)’ను అధికారులు పరిశీలిస్తారు.
- ఎన్నారైల స్థానిక కుటుంబ సభ్యులకు ‘సుపథం’ మార్గంద్వారా అనుమతి ఉండదు. వారు సాధారణ, ఆన్‌లైన్ రూ.300 టికెట్లు బుక్ చేసుకుని రావాల్సి ఉంటుంది.
వసతి, ఇతర సేవలు ఇలా..
- ఎన్నారైలు వసతి, ఆర్జిత సేవల వంటి ఇతర సౌకర్యాల కోసం తితిదే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- తితిదే అధికారిక వెబ్‌సైట్ (టీటీ దేవస్థానామ్స్) లేదా టీటీడీ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
- ఎన్నారై భక్తులు తమ పాస్‌పోర్టు నంబర్‌ను ఐడీ ప్రూఫ్‌గా ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
- తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. భారతదేశానికి బయలుదేరడానికి కనీసం 60 రోజులు ముందుగానే వసతిని బుక్ చేసుకోవడం మంచిది.
- ఆర్జిత సేవలనూ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
- అత్యంత డిమాండ్ ఉన్న సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలను లక్కీడిప్ (ఎలాక్ట్రానిక్ డిప్) విధానం ద్వారా పొందొచ్చు. ఈ డిప్‌లో పాల్గొనడానికి పాస్‌పోర్టు వివరాలు తప్పనిసరి.
- దర్శనం లేదా వసతికి హాజరయ్యేటప్పుడు, బుకింగ్‌లో వాడిన అసలు పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా చూపించాలి.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.