Saudi Arabia: ఎడారిపై మంచు దుప్పటి.. సౌదీలో ఎందుకీ వింత పరిస్థితి..?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: భరించలేని వేడి, పొడివాతావరణం, ఇసుక తిన్నెలు.. ఇలా సౌదీ అరేబియాలో ఎడారి ఎక్కువభాగమే కనిపిస్తుంది. అలాంటి ఈ దేశాన్ని అనూహ్యంగా మంచు దుప్పటి కప్పేసింది (Snowfall in the desert). భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వెలుగుచూస్తోన్న ఈ వాతావరణ మార్పులు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో భయాన్ని పుట్టిస్తున్నాయి.
సౌదీ అరేబియా ( Saudi Arabia)లోని ఉత్తర, మధ్య ప్రాంతంలో ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేనివిధంగా కనిపిస్తున్నాయి. అక్కడ 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనాపై మంచుతో పాటు వర్షం పడింది. హెయిల్ ప్రాంతంలోనూ అదే పరిస్థితి కనిపించింది. అలాగే చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. రాజధాని నగరం రియాద్ ఉత్తరం వైపున విస్తరించిన ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం కురిసినట్లు వెల్లడించింది. మేఘాలతో చల్లనిగాలులు సంఘర్షణ చెందడం వల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. వరదలు సంభవించే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పాలని రియాద్‌లోని పాఠశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE)లో అసాధారణంగా కురుస్తోన్న వర్షాలు, దక్షిణాసియాలో వేడిగాలులు, యూఏఈలో ఆకస్మిక వరదలు, ఐరోపా, ఉత్తరాఫ్రికాలో హిమపాతం వంటి పరిణామాలకు పర్యావరణ మార్పుల సెగ కారణమవుతోందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎలా రూపాంతరం చెందుతుందో ఇవి వెల్లడిచేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఎవరెస్టంత ఎత్తు వెళ్లే హెలికాప్టర్లు భారత్‌లోనే తయారీ - మోదీ భారత్- ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ దశాబ్దాలుగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని చెప్పారు.
- బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం Bangladesh PM Tarique Rahman: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.
- వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
- ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు.
- అమెరికా బాటలో చైనా.. మెరైన్ కోర్ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్ కోర్‌ను ఏర్పాటుచేసింది.
- యూనస్ నోట మళ్లీ ‘సెవెన్ సిస్టర్స్’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
- పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
- ముంబయి తీరంలో సీజ్ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
- కిమ్ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
- గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
- బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
- పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.