Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/12/2025)

Eenadu icon
By National News Team Published : 23 Dec 2025 00:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

మనోబలంతో  ముందుకు సాగితే అనుకున్న పని నెరవేరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం..

వృషభం

ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు.శ్రీలక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం.

మిథునం

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి.  ఈశ్వర నామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటకం

లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి.కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది.శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం

దైవబలం రక్షిస్తోంది. ముఖ్య నిర్ణయాల్లో ముందడుగు వేసేటప్పుడు తోటి వారి సలహాలు అవసరం అవుతాయి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కన్య

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. సూర్య ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

తుల

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి.

వృశ్చికం

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన  పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. చంద్రశ్లోకం చదవాలి.

ధనుస్సు

ఉద్యోగ,వ్యాపారాల్లో  మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. వివాదాల్లో తల దూర్చకండి. శనిశ్లోకం శుభప్రదం.

మకరం

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. 

కుంభం

బద్ధకించకుండా పనిచేస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మీనం

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. గోవిందనామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
  • కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్‌ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
  • గేట్స్‌ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్‌ గేట్స్‌ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
  • చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
  • బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్‌ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్‌ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
  • కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.
  • వనవటు దేశమా.. అలాంటిదేదీ లేదే!: సుప్రీం వనవటు అనే దేశమేదీ లేదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.