Jitesh Sharma: జితేశ్ ఏం తప్పు చేశాడు.. అన్యాయంగా అతడిపై వేటు

Eenadu icon
By Sports News Team Updated : 22 Dec 2025 13:36 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈసారి భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా 50 రోజుల సమయం ఉండగానే ఇందులో తలపడే టీమ్ఇండియా జట్టును ప్రకటించారు. ఈ టోర్నీ ముంగిట న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడబోతోంది. దానికి కూడా కలిపి జట్టును ప్రకటించారు. ఈ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్ణయం సబబే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. గిల్ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కలిసి ఆడిన గేమ్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ విషయంలో వీళ్లిద్దరూ వ్యవహరించిన తీరు కూడా విమర్శల పాలవుతోంది. జితేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘‘జితేశ్ శర్మ ( Jitesh Sharma)ను చూస్తే జాలేస్తోంది. అతను ఏ తప్పూ చేయలేదు. తనకు దక్కిన అవకాశాల్లో అతను వికెట్ కీపర్, బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన చేశాడు. ధోనీ తర్వాత వికెట్ల వెనక బాధ్యతలు సరిగా నిర్వర్తించడమే కాక, డీఆర్ఎస్ విషయంలో మెరుగ్గా వ్యవహరించింది అతనే’’.. ఇదీ సునీల్ గావస్కర్ ( Sunil Gavaskar) అభిప్రాయం. ఒక్క సన్నీ మాత్రమే కాదు.. భారత క్రికెట్ అభిమానులంతా కూడా జితేశ్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాడిగా విఫలం కావడం వల్ల అతడిపై వేటు పడలేదన్నది స్పష్టం. అతను బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినపుడు బాగానే ఆడుతున్నాడు. వికెట్ల వెనక కూడా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తున్నాడు. అయినా అతడిపై వేటు పడింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంలో జితేశ్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. విదర్భ తరఫున దేశవాళీ క్రికెట్లోనూ మంచి రికార్డే ఉంది. టీ20ల్లో అతను 3 వేలకు పైగా పరుగులు చేశాడు. టీమ్ఇండియా అతన్ని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలనుకుంది. అంతకుముందు ఆ పాత్ర పోషిస్తున్న రింకు సింగ్‌ను పక్కనపెట్టి అవకాశాలు ఇచ్చారు. ఒక దశలో సంజు శాంసన్‌ను కూడా పక్కనపెట్టి తొలి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా తుది జట్టులో ఆడించారు. అంతర్జాతీయ టీ20ల్లో జితేశ్ గణాంకాలు చూస్తే గొప్పగా అనిపించవు. 18 మ్యాచ్‌ల్లో 18 సగటుతో 162 పరుగులే చేశాడు. అయితే ఈ లెక్కలు చూసి జితేశ్ విఫలమయ్యాడు అనుకుంటే పొరపాటే. అతను టీ20ల్లో 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో అతను రాకముందే ఇన్నింగ్స్ ముగిసిపోతోంది. బ్యాటింగ్‌కు వచ్చినా ఆడే బంతులు తక్కువ. దక్షిణాఫ్రికా సిరీస్ విషయానికే వస్తే.. నాలుగు టీ20ల్లో కలిపి అతను ఎదుర్కొన్నది కేవలం 22 బంతులు. ఒక మ్యాచ్‌ల్లో 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీన్ని వైఫల్యం అనగలమా? బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తుండడంతో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రావట్లేదు. వచ్చినపుడు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనుక ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు.

అలాంటప్పుడు అతను విఫలమయ్యాడని అనగలమా? ఫినిషర్ బాధ్యతలను అప్పగించి, బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన ఆడించిన జట్టు యాజమాన్యం ఇప్పుడు అతన్ని ఏ కారణంతో తప్పించారో చెప్పలేని పరిస్థితి. రింకు (Rinku Singh)ను ఎందుకు పక్కనపెట్టారో.. మళ్లీ ఇప్పుడు జితేశ్‌ను తప్పించి రింకునే ఎందుకు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశారో అర్థంకాని పరిస్థితి. మొన్నటివరకు సంజును కూడా పక్కనపెట్టి జితేశ్‌ను ఆడించారు. కానీ ఇప్పుడు గిల్‌ను పక్కన పెట్టి సంజు ( Sanju Samson)ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. అతడికి తోడుగా ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఇలా ఎందుకు అంటే ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కూడా టాప్ ఆర్డర్లో ఆడే ఆటగాడే అయ్యుండాలని భావించాం అంటున్నారు. జితేశ్‌ను కూడా ఎంపిక చేస్తే జట్టులో అప్పుడు ముగ్గురు వికెట్ కీపర్లు ఉంటారు. అలా బాగుండదని.. కిషన్‌ను ఎంపిక చేయడం కోసం జితేశ్‌ను పక్కన పెట్టినట్లుంది. ఫినిషర్ పాత్ర కోసం స్పెషలిస్టు బ్యాటర్ అయిన రింకును ఎంచుకున్నట్లున్నారు. అయితే ఏ కారణం చెప్పినప్పటికీ ఇక్కడ జితేశ్‌కు అన్యాయం జరిగిందన్నది స్పష్టం. జట్టు యాజమాన్యం ఆడిన ఆటలో జితేశ్ పావు అయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దారులు మూసుకుపోయినట్లేనా?

జితేశ్ ప్రతిభ తెలిసిన వాళ్లు టీ20 ప్రపంచకప్‌లో ఉండదగ్గ ఆటగాడని అభిప్రాయపడుతున్నారు. అతడి బ్యాటింగ్‌లో టెక్నిక్ ఉంది. అలాగే టీ20లకు అవసరమైన దూకుడూ ఉంది. అవసరమైతే జితేశ్ టాప్ ఆర్డర్లో కూడా ఆడగలడు. ఐపీఎల్‌లో అలా ఆడిన అనుభవమూ ఉంది. కానీ సెలక్టర్లు అతడిని అనూహ్యంగా జట్టు నుంచి తప్పించారు. అయితే అతడికి పూర్తిగా దారులు మూసుకుపోయినట్లు కాదు. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ఆరంభం కానుంది. ఆలోపు జట్టును మార్చుకోవడానికి భారత్‌కు అవకాశముంది. కాబట్టి జట్టులో ఉన్న ఏ ఆటగాడైనా గాయపడ్డా లేదా సంజు, ఇషాన్‌ సరిగా రాణించకపోయినా జితేశ్‌ను ఎంచుకోవడానికి అవకాశముంది. ఈలోపు జితేశ్ విజయ్ హజారే టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. అందులో సత్తా చాటితే, కాలం కలిసొస్తే టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కొట్టిపారేయలేం.

- ఈనాడు క్రీడా విభాగం

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 13:28 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
  • వరల్డ్‌ కప్‌ తర్వాత.. ఆ మోడల్‌తో మా మనవడి పెళ్లి: ఇషాన్‌ తాతయ్య ఇషాన్ కిషన్‌ పెళ్లిపై ఓ స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు జరగబోతుందో కూడా ఇషాన్‌ తాతయ్య అనురాగ్‌ పాండే వెల్లడించారు. 
  • ఇషాన్‌ అద్భుతం.. రోహిత్‌ మాకు ఏం చెప్పాడంటే?: సంజనతో బుమ్రా చిట్‌చాట్‌ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌ తర్వాత తన భార్య, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో బుమ్రా మాట్లాడాడు.