ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

Eenadu icon
By Telangana Dist. Team Updated : 22 Dec 2025 18:42 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌, పూర్ణిమ భార్యాభర్తలు. వీరిద్దరు ఈస్ట్‌ బృందావన్‌ కాలనీలో ప్లేస్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న అశోక్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశోక్‌ది హత్య అని తేలడంతో.. పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న ప్రియుడు మహేశ్‌తో కలిసి అశోక్‌ను హత్య చేసినట్లు పూర్ణిమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:14 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని