సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు: హోంమంత్రి అనిత

- A
- A+
- A++

ఒంగోలు: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టుదలతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, అదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి సోమవారం ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రితోపాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.



గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.