ఉత్సాహంగా ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

- A
- A+
- A++

మంగళగిరి టౌన్: మంగళగిరిలోని నారా లోకేశ్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఈనాడు ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు 8 జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అంబేడ్కర్ లెవెన్స్ ఈమని వర్సెస్ పీసీ లయన్స్ కాజ మధ్య జరిగిన మ్యాచ్‌లో పీసీ లయన్స్ గెలుపొందింది. లెవెన్ థండర్స్ వర్సెస్ సాయి సీసీ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లెవెన్ తండర్స్ విజయం సాధించింది. కొత్తపేట సూపర్ కింగ్స్, గల్లీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొత్తపేట సూపర్ కింగ్స్, పవన్ సీసీ వర్సెస్ హనుమాన్ యూత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పవన్ సీసీ జట్టు విజయం సాధించాయి. ప్రతీ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి మంగళగిరి మార్కెట్ యార్డు ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ. 3 వేల నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు.

ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పిటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీల్లో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు (మంగళాద్రి డెవెలపర్స్), ద్వితీయ బహుమతి కింద రూ.2 లక్షలు (మంచికలపూడి వైష్ణవి), తృతీయ బహుమతి కింద రూ.లక్ష నగదును (వెలగపూడి కిషోర్) సహకారంతో అందించనున్నారు. అలాగే ప్రతి మ్యాచ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు (జవ్వాది కిరణ్ చందు), ప్రతి మ్యాచ్ టాస్ విన్నర్‌కు సిల్వర్ కాయిన్, అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్‌కు గోల్డ్ కాయిన్ (రేవతి జ్యూవెలరీ), మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ (వల్లభనేని భార్గవ్), బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్‌కు రూ.25 వేలుతో పాటు ఎలక్ట్రికల్ సైకిల్ (కాసరనేని జస్వంత్), బౌలర్ ఆఫ్ ది సిరీస్‌కు రూ.25 వేలుతో పాటు బై సైకిల్ (గుత్తా కిషోర్), ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలతో పాటు బైసైకిల్ (తాడిబోయిన మహేష్), వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ రూ. 25 వేలుతో పాటు బై సైకిల్ (షేక్ ఇంతియాజ్)లు అందించనున్నారు.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- షోరూంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం [ 18-02-2026] విజయవాడలోని మొగల్‌రాజ్ పురంలోని షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది.
- ఆక్రమణదారుపై కఠిన చర్యలు తీసుకోవాలి: రైతుల విజ్ఞప్తి [ 18-02-2026] జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా లేఅవుట్ వేసిన వ్యక్తి 40 అడుగుల రహదారిని నిర్మించేందుకు పక్కనే ఉన్న ఎన్‌ఎస్పీ మైనర్ కాలువను కలిపేసుకున్నాడు.
- రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు [ 18-02-2026] ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలిలో సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి తిరుణాళ్లు జరిగాయి.
- వైభవంగా నాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవం [ 18-02-2026] కోరిన కోర్కెలు తీర్చే అమ్మ పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
- డీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట సహకార సంఘాల సిబ్బంది ధర్నా [ 18-02-2026] పట్టణంలో స్థానిక కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల సహకార సంఘాల సిబ్బంది ధర్నా నిర్వహించారు.
- గ్రంథాలయాల అభివృద్ధికి కృషి [ 18-02-2026] జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ భీమనేని వందనా దేవి అన్నారు.
- గుడివాడ సీసీఎస్ పీఎస్ గోదాములో అగ్నిప్రమాదం [ 18-02-2026] కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్‌స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
- తవ్వుకో రేవంతా.. తోలుకో రోజంతా.. [ 18-02-2026] ఇసుకాసురుల ధన దాహానికి కృష్ణా నది గుల్లబారిపోతోంది. ఉచిత ఇసుక మాటున భారీ దందా సాగిస్తున్నారు. నేతలు.. అధికారులు ఏకమై ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. కళ్లముందే నిబంధనలకు పాతరేసినా అధికారులకు పట్టదు. నేతల అండతో రేవుల్లో అక్రమాలకు అంతేలేదు.
- నీరిస్తారా? నీరుగారుస్తారా? [ 18-02-2026] గుంటూరు నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్న వ్యవస్థల్లో లోపాలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సైతం సమస్యలను మరింతగా జటిలం చేస్తున్నాయి.
- మెప్మాలో రుణ బాగోతాలపై విచారణకు కలెక్టర్ ఆదేశం [ 18-02-2026] గత వైకాపా పాలనలో మెప్మా విభాగంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించి విచారణకు ఆదేశించారు.
- ఎయిమ్స్ ప్రస్థానం అద్వితీయం [ 18-02-2026] మంగళగిరి ఎయిమ్స్ ప్రస్థానం అద్వితీయం. బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు స్తంభాలపై నిలిచి ఉంది. నమ్మకం అనే నాలుగో స్తంభాన్ని కూడా చేర్చాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.
- రాజధానిలో భూసేకరణకు సిద్ధం [ 18-02-2026] నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొంతమంది రైతులు వివిధ కారణాలతో ఇప్పటికీ భూసమీకరణలో భూములివ్వలేదు.
- చిట్టి తల్లులు.. చేదు నిజాలు.. [ 18-02-2026] చిట్టితల్లులు చిక్కుల్లో పడుతున్నారు.. కౌమార దశలోనే పెద్ద బాధ్యతను కడుపులో మోస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లిప్తత.. కారణాలేమైనా టీనేజ్ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు పడుతున్నారు.
- సరఫరాలో జాప్యం.. స్పందిస్తే నయం [ 18-02-2026] ఉమ్మడి జిల్లాలో మిల్లర్లను ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కొరత వేధిస్తోంది. కొన్నాళ్లుగా వీటి సరఫరా సరిగాలేక ఇబ్బందులు తప్పడంలేదు. అవి కలిపాకే బియ్యాన్ని మిల్లర్లు సరఫరా చేయాల్సి రావడంతో ఉమ్మడి జిల్లాలో భారీగా నిల్వలు మిల్లుల్లోనే నిలిచిపోయాయి.
- మునేరు కరకట్టకు మోక్షం..! [ 18-02-2026] 2024 వరదలు మునేరు వెన్ను విరిచాయి. కరకట్టకు 23చోట్ల గండ్లు పడ్డాయి. అనేకచోట్ల గట్లు బలహీనపడ్డాయి. భవిష్యత్తు దృష్ట్యా.. ముందు జాగ్రత్తగా కూటమి సర్కారు నడుం కట్టింది. గండ్లు పూడ్చే పనులకు రంగం సిద్ధం చేసింది.
- సిమ్‌లు మారుస్తూ.. సీన్ ఏమారుస్తూ! [ 18-02-2026] సంచలనం రేపిన పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంక తప్పించుకు తిరుగుతోంది. గత నెలలో మేరఠ్‌లో త్రుటిలో తప్పించుకున్న నిందితురాలు ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తోంది. బెజవాడ పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో..
- చేసేది మ్యూల్ వ్యవహారాలు.. చెప్పేది సాఫ్ట్‌వేర్ కొలువు [ 18-02-2026] తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అనీ, జీతం నెలకు రూ.30 వేలనీ.. ఇంట్లో అందరినీ నమ్మించాడు. కానీ చేసేది చట్టవిరుద్ధ కార్యకలాపాలే. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల కేసులో కీలక సూత్రధారి రాజా వెంకట్ వ్యవహారమిది.