Tourist places: మంచుకురిసే వేళలో.. మనసైన విహారం!

- A
- A+
- A++

చలి గిలిపెడుతుంటే కొందరు ముసుగేసి ఇంటికే పరిమితమైతే... మరికొందరు మంచుదుప్పటి కప్పుకొన్న వాతావరణాన్ని ఆస్వాదించేందుకు చలో అంటారు. సుందరమైన శీతాకాల ప్రకృతి దృశ్యాలే వీరి యాత్రలకు ప్రేరణలు. భారతీయులు విహారాలకు ఇష్టపడేది చలికాలాన్నే అని ఎయిర్‌బీఎన్‌బీ 2025 సర్వే కూడా తేల్చింది.. మరి మనవాళ్లు ఎక్కడెక్కడకు వెళుతున్నారో... తెలుసుకుందామా?
- వానాకాలంలో సెలవులుండవు... వేసవిలో సెలవులున్నా వాతావరణం సహకరించదు. హిల్ స్టేషన్లకు మినహా ఇతర విహార ప్రదేశాలకు వెళ్లలేం.
- దసరా మొదలుకుని సంక్రాంతి ముగిసే వరకు ఉండే ఆహ్లాదకర సీజన్ పర్యాటకులకు అద్భుతకాలం. ఈ సీజన్‌లోనే 55 శాతం పర్యాటక రద్దీ ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ సర్వేలో వెల్లడైంది.
- జెన్ జీ, మిలీనియల్స్. విద్యాసంస్థలకు సెలవులు రాగానే శీతాకాల ప్రయాణాలకు సిద్ధపడుతున్నారు. మొత్తం యాత్రికుల్లో వీరే 50 శాతం వరకు ఉంటున్నారు.
ఎందుకెళుతున్నారు?
- పని నుంచి కాస్త ఉపశమనం, కొత్త ప్రదేశాల అన్వేషణ, కుటుంబంతో గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం కోసం విహారాలకు వెళుతున్నారు.
- హైబ్రిడ్ పని విధానం కూడా మిలీనియల్స్‌కు కలిసి వచ్చింది. వర్క్ ఫ్రం హోం మాదిరి వీరు వర్క్ ఫ్రం వెకేషన్ అంటున్నారు.
- సంవత్సరాంతపు, కాలానుగుణ సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు 30 శాతం మంది ఈ సీజన్‌ను ఎంచుకుంటున్నారు.
- 30 శాతం మంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌బీఎన్‌బీ సర్వేలో వెల్లడించారు.
- శీతాకాలంలో మాత్రమే వీక్షించాల్సిన దృశ్యాలు... డార్జిలింగ్‌లో సూర్యోదయం, కశ్మీర్‌లో హిమపాతం వంటివి ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు బారులు తీరుతున్నారు.

హైదరాబాద్‌కు 80 కి.మీ. దూరంలోని అనంతగిరి హిల్స్ శీతాకాలంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు వారాంతాల్లో షికారుకు వెళుతుంటారు. క్యాంపింగ్‌కు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిలో చలికాలంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతుంటాయి. ఈ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మంచు కురవడం, ఆపిల్ తోటల సాగు, పొగ మంచు, లోయల సుందర దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. చింతపల్లి రైల్వే స్టేషన్ నుంచి 20 కి.మీ. దూరంలో లంబసింగి ప్రాంతం ఉంటుంది.

శీతాకాలంలో అరకు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆంధ్రా ఊటీగా పిలిచే ఈ ప్రాంతం చుట్టూ కొండలు, కాఫీ తోటలు, పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తుంది. విశాఖ నుంచి అరకు వరకు రైలు ప్రయాణం మరుపురాని అనుభూతి. ఇక్కడ గుడారాలు వేసుకుని క్యాంప్‌ఫైర్‌తో వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. వణికించే చలిలో తెల్లవారుజామునే లేచి మడగడ వ్యూపాయింట్‌కు వెళుతుంటారు. అక్కడి లేలేత కిరణాలతో ఉదయించే భానుడు, పొగమంచు ప్రవాహం భూతల స్వర్గంలా అనిపిస్తుందని పర్యాటకులు చెబుతుంటారు.

బెంగళూరు నుంచి 60 కి.మీ.దూరంలో నందిహిల్స్ ప్రాంతం ఉంటుంది. మేఘాల మధ్య సూర్యోదయం ప్రసిద్ధి. ఉదయపు చల్లగాలులు, పొగమంచుతో కూడిన వాతావరణం గిలిగింతలు పెడుతుంది. ప్యారాగ్లైడింగ్, సైక్లింగ్‌కు అనుకూలం.

శ్రీనగర్‌కు సమీపంలోని గుల్మార్గ్ భూతల స్వర్గం. సముద్ర మట్టానికి 8,690 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్‌లో నమోదవుతాయి. ఇక్కడి నుంచి మరింత ఎత్తులో ఉన్న గోండోలాకు కేబుల్ కారులో ప్రయాణిస్తూ మంచు అందాలను వీక్షించవచ్చు. మంచు క్రీడలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

కర్ణాటకలోని కూర్గ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ సమయంలో చాలా ఆకట్టుకుంటాయి. జలపాతాలు, కాఫీతోటలు, పొగమంచుతో ఈ ప్రాంతం పోతపోసిన ప్రకృతి సౌందర్యంలా ఉంటుంది. ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, క్యాంపింగ్‌కు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ హోమ్ స్టే సౌకర్యాలున్నాయి.

సముద్రతీర ప్రాంతం గోవాని సైతం ఈ సమయంలో ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. క్రిస్‌మస్, కొత్త సంవత్సర వేడుకలతో సందడిగా ఉంటుంది. విదేశాల్లో మాదిరి అక్కడి వాతావరణం మొదటిసారి వెళ్లినవారిని ఆకట్టుకుంటుంది. మళ్లీ మళ్లీ వెళ్లేలా చేస్తుంది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:34 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్‌లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.