Instamart order analysis: ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్: 368 సార్లు కరివేపాకు.. కండోమ్‌లకు రూ.లక్ష!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Instamart order analysis | దిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్‌కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ (Instamart) ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. 2025 యాన్యువల్ ఆర్డర్ అనాలసిస్ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్ఠంగా రూ.10 వెచ్చించి ప్రింటవుట్‌లు తెప్పించుకోగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడళ్ల కోసం రూ.4.3 లక్షలు వెచ్చించాడట.
2025లో ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలో రూ.22 లక్షలు ఖర్చు చేశాడని ఇన్‌స్టా తన నివేదికలో తెలిపింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి రూ.15.16 లక్షలు విలువైన గోల్డ్‌ను కొనుగోలు చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కండోమ్‌ల కొనుగోలుకు లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు అనాలసిస్ రిపోర్ట్ పేర్కొంది. టైర్-2 నగరాల్లో రాజ్‌కోట్ అత్యధికంగా 10 రెట్ల వృద్ధిని నమోదు చేయగా.. లుథియానా 7, భువనేశ్వర్ 4 రెట్ల వృద్ధి కనిపించిందని తెలిపింది.
- జనవరి 1 నుంచి ఏథర్ ఈవీ ధరలకు రెక్కలు
దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు వంటివి ఉన్నాయని ఇన్‌స్టామార్ట్ రిపోర్ట్‌లో పేర్కొంది. కొచ్చికి చెందిన ఓ వ్యక్తి 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ పెట్టాడట. అంటే రోజుకు సగటున ఓసారి ఆర్డర్ పెట్టాడమన్నమాట. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డెలివరీ బాయ్‌కి ఏకంగా రూ.68,600 టిప్‌గా చెల్లించి ఆశ్చర్యపరిచాడు. ఉదయం 7 నుంచి 11 మధ్య, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు నివేదిక తెలిపింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:43 IST