Arjun Reddy: జగన్ బంధువు అర్జున్‌రెడ్డిని విచారించిన పోలీసులు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది. అర్జున్ రెడ్డి, వైకాపా నాయకులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 2024లో సిరిగిరి అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశామని గుడివాడ టు టౌన్ సీఐ హనీష్ తెలిపారు. ఇటీవల ఆయనకు 41ఏ నోటీసులిచ్చామని, కేసు విషయమై విచారించినట్టు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
మరోవైపు వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నందున అతడిని గుడివాడ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినోద్ నుంచి రూ.50వేల నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వైకాపా అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా జూద శిబిరాలు నిర్వహించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ శిబిరాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు వినోద్‌పై కేసు నమోదు చేశారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 12:51 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.