H-1B visa: భారత్‌లో హెచ్-1బీ వీసాదారుల వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణలో చిక్కులు..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌కు తిరిగొచ్చిన హెచ్-1బీ వీసాదారుల అమెరికన్ వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్‌మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. డిసెంబర్ 15-26 మధ్య అపాయింట్‌మెంట్లను వాయిదా వేసింది. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావడం కూడా ఓ కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపినట్లు సదరు పత్రిక వెల్లడించింది.
దీనిపై అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందిస్తూ విదేశాంగశాఖ ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ వీసాదారులకు సంబంధించి ఎఫ్, ఎం, జే కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తోందన్నారు. దీనిలోనే ఇప్పుడు హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తుదారులను కూడా చేర్చారన్నారు. ఇక అమెరికా విదేశాంగశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి.. నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టే వాళ్లమన్నారు. కానీ, ఇప్పుడు భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
అమెరికాలో ఉద్యోగం చేయడానికి జారీ చేసే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌ను వర్క్‌పర్మిట్‌గా వ్యవహరిస్తుంటారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 08:42 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.