తగాదాలు ‘రాజీ’నామా.. అనుబంధాలు రాసిన వీలునామా!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే: కలసి ఉంటే కలదు సుఖం అంటారు. ప్రేమాప్యాయతలు ఉన్న కుటుంబంలో అనుబంధాలు వెల్లివిరుస్తాయి అంటారు. ఆ విషయం మరిచిన అన్నదమ్ములు వారసత్వ ఆస్తి కోసం తగాదా పడ్డారు. మూడు దశాబ్దాలకు పైగా పోరు సాగించారు. ఆ ప్రయాణంలో వారికి మిగిలిగింది అలుపే. వెనక్కి తిరిగి చూసుకుంటే.. తాము గెలిస్తే పొందే ఆస్తికన్నా కోల్పోయిందే ఎక్కువని అర్థమైంది. లోక్ అదాలత్‌లో ‘రాజీ’ మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఊశన్నకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో ముగ్గురికి తన 1.06 ఎకరాల భూమిని వారసత్వ ఆస్తిగా ఇచ్చారు. దీంతో మిగతా ఇద్దరు 1994లో కోర్టు మెట్లెక్కారు. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు దాకా.. 2024వరకు కొట్లాడుతూనే ఉన్నారు. ఈ సమయంలో చేసిన ఖర్చు, ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, కలిగిన శారీరక శ్రమ అంతాఇంతా కాదు. ఒక తల్లి కడుపున పుట్టినవారే వైరివర్గాలుగా మారడంపై పశ్చాత్తాపం చెందారు. అంతా కలిసి జిల్లాకేంద్రంలోని జాతీయ లోక్‌అదాలత్ బెంచ్‌ను ఆశ్రయించారు. న్యాయసేవాసంస్థ ప్రతినిధుల సమక్షంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటూ ఆదివారం ‘తుది’ తీర్పును అందుకున్నారు. ఉన్న భూమిని ఆరుగురూ సమానంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘవిరామం తర్వాత ఆఖరి విజయం అనుబంధాలకే దక్కింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 14,30,553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 11,25,212 ప్రి లిటిగేషన్ కేసులు, 3,05,210 పెండింగ్ కోర్టు కేసులున్నాయి. ఈ కేసుల్లో బాధితులకు రూ.778 కోట్ల పరిహారాలు అందాయని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైకోర్టు ప్రాంగణంలో 129..:తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో 129 కేసులు పరిష్కారమయ్యాయి. జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ వేర్వేరు బెంచ్‌లకు నేతృత్వం వహించగా 112 మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌లు, 7 వర్క్‌మెన్ కంపెన్సేషన్ కేసులు, 9 సర్వీస్ రిట్ పిటిషన్లు, 1 నాన్ సర్వీస్ రిట్ అప్పీల్ పరిష్కారమయ్యాయి. సుమారు రూ.11 కోట్ల పరిహారంతో 860 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 07:32 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పార్టీలో అవమానం ఇంకెంతకాలం.. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్న వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- ఆ బూడిద భారం కరెంటు ఛార్జీలపై వద్దు! థర్మల్ విద్యుత్కేంద్రాల (టీపీపీల) నుంచి వెలువడుతున్న బూడిదను అవసరమైతే పరిశ్రమలకు ఉచితంగానైనా ఇచ్చేయాలని, దాని తరలింపు పేరుతో సామాన్య ప్రజలు చెల్లించే కరెంటు ఛార్జీలపై ఆర్థికభారం మోపవద్దని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది.
- రూ.కోట్లు పోయె... గెలవకపాయే! వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఇది. ఖర్చుల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గంలేక ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతున్నారు.
- కర్ల రాజేశ్ మృతి కేసులో అలసత్వం ఎందుకు? దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి ఘటనలో అధికారుల పనితీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
- మేయర్ జీతమెంతో తెలుసా? రాష్ట్రంలోని 7నగరపాలక సంస్థలు, 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉపమేయర్లు.
- తల్లడిల్లుతూ.. తల్లి ప్రేమను చాటిన ఆవు తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
- ‘పుర’ విజేతల్లో 64 మంది మహిళలే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 112 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్ల పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో 57.14% మంది మహిళలు విజయం సాధించారు.
- వైభవంగా మల్లన్న ‘పెద్ద పట్నం’ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున ‘పెద్ద పట్నం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
- శ్రీ చైతన్య ప్రభంజనం జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్ 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు.
- జమ్మికుంటలో తోపులాట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది.
- కాంగ్రెస్ మద్దతుతో.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి పీఠం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక్కడ మొత్తం 10 వార్డులకుగాను.. భాజపా, భారత రాష్ట్ర సమితి , కాంగ్రెస్ అభ్యర్థులు మూడేసి వార్డుల్లో గెలిచారు.
- ‘సీఐఐ-ఐజీబీసీ’ జాతీయ ఛైర్మన్‌గా సి.శేఖర్‌రెడ్డి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) జాతీయ ఛైర్మన్‌గా సీఎస్‌ఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శేఖర్‌రెడ్డి ఎంపికయ్యారు.
- జగిత్యాల భాజపా జిల్లా అధ్యక్షుడిపై దాడి మెట్‌పల్లి పట్టణంలో ఛైర్మన్ సీటు కోల్పోయామన్న ఆగ్రహంతో భాజపా కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు.. తమ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు ఇంటిపై సోమవారం దాడి చేశారు.
- బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం ‘అరుదైన వ్యాధి తినేస్తోంది..ఆదుకోండి!’ అనే శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన మానవీయ కథనానికి దాతలు స్పందించారు.
- విద్యుత్తు బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి ఊరట విద్యుత్తు బకాయిల వివాదం నుంచి హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.
- క్యాన్సర్‌కు కణ చికిత్స క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక అధ్యాయం మొదలైంది. మహమ్మారిని అంతమొందించేందుకు ‘కణ’ చికిత్సను విజయవంతంగా ఆవిష్కరించారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ లెవిన్. వర్సిటీలోని ‘పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో క్యాన్సర్ చికిత్సలో సెల్, కార్-టి సెల్, జన్యు థెరపీలపై ఆయన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
- ఒకే వాహనంలో వచ్చిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భాజపా ఎంపీ ఇస్నాపూర్ పురపాలక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒకే వాహనంలో వచ్చారు.
- హైదరాబాద్‌లో సనోఫీ జీసీసీ విస్తరణ ఔషధ తయారీ సంస్థ సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా, హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను భారీగా విస్తరించింది. అత్యాధునిక హంగులతో అదనపు కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
- పీఠాలపై దంపతులు నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి దంపతులు ఎన్నికయ్యారు.
- ఆ మూడు పార్టీల మధ్య బంధమేంటో ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి , ఎంఐఎం పార్టీలు ఏకమై భాజపాను ఎదగనీయకుండా కుట్రలు చేస్తున్నాయని, అయినా రాష్ట్రంలో కమలం బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు.