Sajjala: ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Dec 2025 03:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి, తిరువూరు టౌన్‌ న్యూస్‌టుడే: ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అత్యధిక మెజారిటీతో 200 కంటే (డీలిమిటేషన్‌ అయితే) ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేపడతామని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ 175 సీట్లే ఉంటే 151 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని తెలిపారు. ‘2019-24 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో 15-20 ఏళ్లు ముందుకు తీసుకెళ్లాం. ఈసారి 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్లేలా జగన్‌ పాలనను ప్రజలే తెచ్చుకుంటారు’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘సమకాలీన రాజకీయచరిత్రలో తల ఎగరేసుకుని పొగడాల్సిన నాయకుడు జగన్‌. తన ఐదేళ్ల పాలనలో ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని చేసి చూపించారు. ప్రజలు తమ తలరాతల్ని తామే రాసుకునేలా చేశారు. అప్పులు తెచ్చి పంచలేదు. జగన్‌ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి’ అని సజ్జల ఆకాంక్షించారు. 

అభిమానం పేరుతో అత్యుత్సాహం.. తిరువూరులో పలువురిపై కేసు

జగన్‌ పుట్టినరోజు సందర్భంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం పేరుతో హల్‌చల్‌ చేశారు. దీనికి పెద్దఎత్తున జనాన్ని సమీకరించారు. ఆసుపత్రిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జై జగన్‌ అంటూ కేకలు, ఈలలు వేస్తూ గోలగోల చేశారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై వైకాపా నియోజకవర్గ కన్వీనర్‌ స్వామిదాస్, మరో 20 మంది వైకాపా నాయకులపై తిరువూరు పోలీసులు కేసు నమోదుచేశారు.

  • శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో వైకాపా నాయకులు వేట కొడవళ్లతో పొట్టేళ్ల తలలు నరికి వాటి రక్తంతో జగన్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లులోనూ ఇదే తరహా లో సంబరాలు చేసుకున్నారు.
  • తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధానద్వారం వద్ద పార్టీ కార్యాలయానికి కట్టినట్లు జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీనిపై ప్రజలు, విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
  • స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్‌ ఏఐ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
  • ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్‌ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్‌ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
  • వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.
  • జస్టిస్‌ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
  • నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
  • తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్‌.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
  • డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
  • రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • 498 కేసులో లుకౌట్‌ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
  • బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్‌ కమిషన్‌! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించనుంది.
  • నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్‌ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
  • త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
  • ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ భావన బడోలా.
  • క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్‌ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్‌ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
  • సముద్రాలకు ప్లాస్టిక్‌ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్‌ క్లియర్‌ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
  • సాగరతీరంలో మిలన్‌ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్‌-2026), మిలన్‌ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
  • తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.