ఆ ఉపగ్రహాలు కూలితే ఏమవుతాయ్‌?

Eenadu icon
By National News Desk Updated : 22 Dec 2025 13:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగంగా మోహరించిన ఓ ఉపగ్రహం అదుపుతప్పింది. ఈ శాటిలైట్‌ పేరు స్టార్‌ లింక్‌-35956. భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇందులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది త్వరగా పడిపోతూ భూమివైపునకు దూసుకొస్తోంది. మరి ఈ ఉప్రగహంతో ప్రమాదం పొంచి ఉందా..?

స్టార్‌లింక్‌ ప్రాజెక్టును 2015లో స్పేస్‌ఎక్స్‌ ప్రారంభించింది. ఇంటర్నెట్‌ సేవల కోసం నిర్మించిన వేలాది ఉపగ్రహాల సమూహమిది. ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించడం, ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. తొలి దశలో 12 వేల వరకు పంపాలన్నది సంస్థ ప్రణాళిక. ప్రస్తుతం 9,357 గ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. దీర్ఘకాలంలో 42 వేల ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్‌ మోహరించనుంది.

వీటి జీవితకాలమెంత

స్టార్‌లింక్‌ ఉపగ్రహాలకు దాదాపు 5 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. పాతవి అయిపోతే ఉద్దేశపూర్వకంగా డీఆర్బిట్‌ చేస్తారు. స్టార్‌ లింక్‌-35956 మాత్రం అదుపుతప్పింది. ప్రస్తుతం స్టార్‌లింక్‌లో 9,000+ ఉపగ్రహాలు ఉన్నాయి. రోజుకు 1-2 సాధారణంగా పడిపోతాయి. ఇవి భూమికి దగ్గరగా (భూ దిగువ కక్ష్యలో) తిరుగుతాయి.

ఎందుకిది విఫలమైంది

ప్రొపల్షన్‌ సిస్టమ్‌లో సమస్య కారణంగానే అని అనుమానిస్తున్నారు. ఇతర వస్తువుతో ఢీకొట్టలేదని చెబుతున్నారు. అయితే ఇది అరుదైన సంఘటన. ఈ ఉపగ్రహాల్లో 3 శాతం వరకు విఫలమవ్వడం సాధారణమే అయినా ఈ స్టార్‌ లింక్‌-35956 మాత్రం శకలాలను వెదజల్లింది. అంటే అంతరిక్షంలోకి చెత్తను విడుదల చేసింది.

ఇది ప్రమాదమా

ఈ శకలాలతో అంతరిక్ష పర్యావరణానికి పెద్దగా హాని కలగదంటోంది స్పేస్‌ఎక్స్‌. శాస్త్రవేత్తలూ అదే మాట చెబుతున్నారు. భవిష్యత్తులో వీటిని భారీగా మోహరిస్తే మాత్రం రిస్క్‌ శాతం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

ఐఎస్‌ఎస్‌కు ముప్పుందా

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కైతే ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఈ ఉపగ్రహం ఐఎస్‌ఎస్‌ కంటే తక్కువ ఎత్తులో ఉంది. కాబట్టి ఇవి ఢీకొనే అవకాశాల్లేవ్‌.

పూర్తిగా కాలిపోతాయా

అవును, చాలావరకు వాతావరణంలోనే కాలిపోతాయి. భూమిపై పడే ప్రమాదం చాలా తక్కువ. 2024లో మాత్రం ఒక అల్యూమినియం ముక్క కెనడాలో పడింది. సాధారణంగా ఇవి సురక్షితం.

సమస్యను తీవ్రంగా తీసుకుంటున్నామని చెబుతోంది. ఒత్తిడి పెరగడం లేదా ప్రొపల్షన్‌ విఫలమవ్వడం వలన ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతోంది. ఉపగ్రహం నుంచి కొన్ని శకలాలు విడుదలయ్యాయని, అవి నెమ్మదిగా కదులుతున్నాయని చెబుతోంది. ఒక్కసారిగా ఉపగ్రహం నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చిందని పేర్కొంది. వారం రోజుల్లో భూ వాతావరణంలోకి వచ్చి కాలిపోవచ్చని వెల్లడించింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 08:31 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
  • ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
  • నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
  • కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు బోగస్‌ అని తేలింది.
  • ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
  • పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
  • ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
  • 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
  • దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవీ ప్రసాద్‌ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
  • సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ మంగళవారం భారత్‌ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
  • ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి. 
  • ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్‌ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్‌ నాగేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
  • వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్‌ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
  • ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్‌ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్‌ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.
  • 22 ఏళ్ల క్రితం అదృశ్యమై… మళ్లీ కుటుంబం చెంతకు! మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్ల క్రితం అదృశ్యమై... 44 ఏళ్ల వయసులో కుటుంబాన్ని కలుసుకున్నారు.