Uttam: ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు?: ఉత్తమ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు.
‘‘పాలమూరు, దిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అవాస్తవాలు చెప్పడం పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు తగదు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తోంది. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే. రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం కేసీఆర్. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారు’’ అని మంత్రి ఉత్తమ్ విమర్శనాస్త్రాలు సంధించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 20:26 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల ప్రముఖులు, సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
- సంక్షిప్త వార్తలు (13) నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినందున రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్ గడువు మంగళవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
- బీసీలకు 61% ఛైర్మన్ పదవులు.. ఉద్యమ ఫలితమే: జాజుల పల్లెల్లోనే కాదూ.. పట్టణాల్లోనూ బీసీల సత్తా చాటామని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కవిత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
- ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ! రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.
- శివుడికి ప్రసాదంగా డ్రగ్స్.. సీపీ సజ్జనార్ పోస్టుతో పోలీసుల యాక్షన్ మహా శివరాత్రి రోజున దేవుడికి మాదకద్రవ్యాలు చూపిస్తూ కొందరు రీల్స్ చేయడంపై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.