సర్పంచి, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

Eenadu icon
By Telangana Dist. Team Published : 21 Dec 2025 19:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

వెల్దండ గ్రామీణం : వెల్దండ మండలం పల్గుతండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచిగా గెలిచిన సభావత్ రమేశ్‌ నాయక్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సన్మానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో  సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులు.. ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గం ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యే.. సర్పంచితో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్‌, వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.

► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని