ఒత్తిడిని జయించాలంటే ధ్యానం ఒక్కటే సరైన మార్గం: ఏపీ సభాపతి

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 21 Dec 2025 19:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నర్సీపట్నం అర్బన్ (అనకాపల్లి): ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీన్ని జయించడానికి ధ్యానం ఒక్కటే సరైన మార్గమని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ‘హార్ట్‌ఫుల్‌నెస్’ సంస్థ ఆధ్వర్యంలో  నిర్వహించిన ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’లో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నారుల నుంచి వృద్ధులు, గృహిణులు, ఉద్యోగుల వరకు అందరూ ఏదో ఒక ఒత్తిడితో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా, ధ్యానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని, ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని