Stock market: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌

Eenadu icon
By Business News Team Updated : 19 Dec 2025 16:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికాలో అంచనాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావడం.. ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఆస్కారం కల్పించినట్లయ్యింది. ఇది పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. దీనికితోడు విదేశీ కొనుగోళ్లూ కలిసొచ్చాయి.

సెన్సెక్స్‌ 447.55 పాయింట్ల లాభంతో 84,929.36 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 585.69 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 150.85 పాయింట్ల లాభంతో 25,966.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.66గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రధానంగా లాభపడ్డాయి. హెచ్‌సీఈఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌క్రూడ్‌ బ్యారెల్‌ ధర 59.58 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 4,325.19 వద్ద కొనసాగుతోంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 16:17 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • యూట్యూబ్‌ డౌన్‌.. లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు YouTube down: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ సేవల్లో అంతరాయం నెలకొంది.
  • ఒక ఛార్జింగ్‌తో 543 కి.మీ. ప్రయాణం మారుతీ సుజుకీ ఇండియా తన తొలి బ్యాటరీ విద్యుత్‌ వాహనం (బీఈవీ) ఇ విటారాను దేశీయంగా విడుదల చేసింది. బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ (బాస్‌) పథకం కింద  ఇ విటారా బీఈవీలను రూ.10.99 లక్షల పరిచయ ధరకు విక్రయించబోతోంది.
  • ఏఐ రెడీ డేటా సెంటర్లపై రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక ఇంధన ఆధారిత, భారీ స్థాయి ఏఐ (కృత్రిమమేధ) రెడీ డేటా సెంటర్ల అభివృద్ధి నిమిత్తం 2035 కల్లా 100 బి. డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది.
  • ఔషధ తయారీలో ‘ఏఐ’శకం ప్రపంచ ఔషధ రంగం కూడా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మందుల ఆవిష్కరణ మొదలు, వాటి తయారీ వరకు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
  • ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ప్రపంచ దేశాలకు జనరిక్‌ ఔషధాల సరఫరాలో అగ్రగామిగా ఉన్న భారత్, 2030 నాటికి బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌ విభాగాల్లో భారీ మార్పులు చూడబోతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహ-ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ అన్నారు.
  • పుంజుకున్న ఐటీ షేర్లు వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, భారీ యంత్రపరికరాల రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు దోహదం చేసింది.
  • ఏఐ సమిట్‌.. నియామకాల వేదిక! దేశీయ అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపు.. దిల్లీలో జరుగుతున్న ఏఐ సమిట్‌ను నిపుణుల నియామకాలకు ఒక వేదికగా వాడుకుంటున్నాయి. దేశీయ ఏఐ రంగంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వేగవంతం అవుతున్నాయి.
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌! విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష సేవల సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అధిపతి.. అమెరికా అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (54), ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్లు-రూ.90 లక్షల కోట్లు కలిగిన వ్యక్తి)గా అవతరించనున్నారు.
  • జియో ఆరోగ్య ఏఐతో నిమిషాల్లోనే పరిశీలన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐ ఆధారిత క్లినిక్‌ మోడల్‌ను ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జియో ఆరోగ్య ఏఐ ఆవిష్కరించింది.
  • ఈడీ విచారణకు టీనా అంబానీ గైర్హాజరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ మళ్లీ గైర్హాజరు అయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం ఆమెకు ఈడీ ఇప్పటివరకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.
  • బంగారు రుణాలకు ప్రత్యేక శాఖలు బంగారం ధర పెరిగి, ఆభరణాల తనఖా రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, ప్రత్యేకంగా ‘గోల్డ్‌ లోన్‌’ శాఖలు ప్రారంభిస్తున్నట్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.  గుజరాత్‌లోని జామ్‌నగర్, జునాగఢ్‌లలో ఈ విభాగంలో ప్రత్యేక శాఖలు నెలకొల్పినట్లు పేర్కొంది.
  • సంక్షిప్త వార్తలు(5) సీఓపీడీ, ఆస్తమా, బ్రాంకేటైసిస్‌ రోగులకు శ్వాసను మెరుగుపరచేందుకు, కంజెషన్‌ను తగ్గించేందుకు ఒక పరికరాన్ని ఆవిష్కరించినట్లు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ పేర్కొంది.
  • కోడింగ్‌ కాదు.. ఏఐని ఎలా ఉపయోగించాలనేదే కీలకం! - నందన్‌ నీలేకని కృత్రిమ మేధ అనేది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ గ్రామర్‌ను తిరిగి రాస్తోందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పేర్కొన్నారు.
  • లావా నుంచి ఎంట్రీలెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.. బోల్డ్‌ ఎన్‌2 ఫీచర్లివే Lava Bold N2: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావా తన బోల్డ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.